Site icon NTV Telugu

Bitra Sivannarayana : సోము వీర్రాజును విమర్శించే అర్హత వాళ్ళకు లేదు

Bitra

Bitra

బీజేపీని దెబ్బ కొట్టాలని మా రాష్ట్ర అధ్యక్షుడిపై బురద జల్లుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ పార్టీల నేతలు, మా పార్టీని‌ వీడిన వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘బీజేపీ సంస్థాగతంగా తీసుకునే నిర్షయాల మేరకే సోము‌ వీర్రాజు పని చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారో కూడా కిషోర్ బాబుకు తెలియదు. సిద్దాంతాల‌ కోసం ఒకే పార్టీలో ఉన్న సోము వీర్రాజును విమర్శించే అర్హత కూడా లేదు. పార్టీని‌ వీడాలనుకుంటే వెళ్లిపోవచ్చు. ప్రజా పోరు యాత్రకు ప్రజల నుంచి మాకు మంచి స్పందన వచ్చింది.

Also Read : Pakistan: కరాచీలో భారీ ఉగ్రదాడి.. పోలీస్ స్టేషన్ టార్గెట్‌గా కాల్పులు..

త్వరలోనే రెండో‌విడత యాత్ర చేపడతాం. కుటుంబ పార్టీల‌ నేతలు బూతులు తిట్టుకుంటున్నారు. 2024 ఎన్నికలలో బీజేపీ, జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తాయి. జనసేనను మభ్య పెట్టేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారు. బీజేపీ బలోపేతం చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు‌ చేపడతాం. ఈనెల‌20న విజయవాడలో సన్నాహక సమావేశం జరుగుతుంది. పార్టీని వీడే వారే బురద జల్లి పోతున్నారు. ఏపీలో అనేక కీలక ప్రాజెక్టులను కేంద్రం నిర్మించింది. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే.. బీజేపీ దానికే కట్టుబడి ఉంది. రెండు కుటుంబ పార్టీలతో రాజధాని నిర్మాణం సాధ్యం కాదు. బీజేపీ ఓట్ల కోసం రాజకీయం ఎప్పుడూ చేయదు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Uddhav Thackeray: ప్రజాస్వామ్యం హత్యకు గురైంది.. పార్టీ, గుర్తును కోల్పోవడంపై ఉద్ధవ్

Exit mobile version