Bhanu Prakash Reddy: ఆంధ్రప్రదేశ్‌లో వైనాట్ 175 అంటూ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, దీనిపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తు్న్నాయి.. వైనాట్ 175 అంటే దొంగ ఓట్ల దందానేనా? జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 20 మంది అధికారులు, 60 మందికి పైగా సిబ్బందితో దొంగ ఓట్లు రాకెట్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు దందాపై సిబిఐ విచారణకు సిద్ధమా? అని సవాల్ చేశారు. నేను ఉన్నాను, నేను విన్నాను.. అంటే దొంగ ఓట్లు ఉన్నాయి, మళ్లీ గెలుస్తా అంటే అసలు కిటుకు ఇదా జగన్మోహన్ రెడ్డి? అని ఎద్దేవా చేశారు. ఇక, దొంగ ఓట్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. ఏ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేశారో బహిర్గతం చేయాలన్న ఆయన.. ప్రింటింగ్ ప్రెస్ పై చర్యలకు డిమాండ్ చేశారు. అసలైన దోషులను వదలి.. కాంట్రాక్టు, కంప్యూటర్ ఆపరేట్లపై కేసు పెట్టడం సబబా? అని ప్రశ్నించారు. ఎంపీ గురుమూర్తికి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి అని సూచించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి.
Read Also: Ram Mandir : రాముడి విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేసిన దిగ్విజయ్ సింగ్