Adinarayana Reddy: 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎన్నికలకు ముందే పొత్తుల గురించి ప్రస్తావన హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో కలిశారు జనసేనాని పవన్ కళ్యాణ్. తాజాగా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా జమ్మలమడుగు లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన మూడు పార్టీలు కలిసి పనిచేయనున్నాయని మాజీ మంత్రి భాజపా ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా జమ్మలమడుగు లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం తర్వాత ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి, జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
Also Read
- Sanjay Raut: తప్పంతా సుప్రీంకోర్టుదే.. ఎంపీల తిరుగుబాటుపై సంజయ్ రౌత్..
- Six Sixes Challenge: డబుల్ సెంచరీ కలను చెదరగొట్టిన ఒక్క షాట్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- US: న్యూయార్లో విషాదం.. గుర్రపు బండి పైనుంచి పడి భారతీయ యువకుడు మృతి
- China Mega Dam: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్.. భారత్కు కొత్త తలనొప్పి..
Read Also:Heavy Rains In Telugu States Live:తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీవర్షాలు
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మోడీ భేటీ, చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ జరిగిందని వివరించారు.వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి సంఘటనలో వాస్తవాలు బయటికి రావడంతో ఎవరు నిందితులో అందరికీ తెలిసిందన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి…. వైయస్ అనే బ్రాండ్ ను పూర్తిగా చెడగొట్టారని ఆయన కుటుంబ సభ్యులే విమర్శించారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.వచ్చే ఎన్నికల్లో తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతానని వివరించారు.
Read Also: Top Headlines @5PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Tollywood: టాలీవుడ్ కాదు.. ఇంటర్నేషనల్!
-
Divija Prabhakar : కొడుకొచ్చేసాడు.. ఇక ఇప్పుడు కూతురి వంతు
-
NEET Re Exam : విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Sanjay Raut: తప్పంతా సుప్రీంకోర్టుదే.. ఎంపీల తిరుగుబాటుపై సంజయ్ రౌత్..
-
Six Sixes Challenge: డబుల్ సెంచరీ కలను చెదరగొట్టిన ఒక్క షాట్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!