Site icon NTV Telugu

BJP Indrasena Reddy : మారనున్న తెలంగాణ బీజేపీ చీఫ్‌.. క్లారిటీ ఇచ్చిన మాజీ అధ్యక్షుడు

Indrasena Reddy

Indrasena Reddy

గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించనున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. దీనిపై బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మారే ప్రసక్తే లేదు… ఎన్నికల వరకు ఆయనే కొనసాగుతారన్నారు. అధ్యక్షుడు మారుతాడంటూ అసత్య వార్తలు ప్రచారం చేయకండని, ప్రధాని మోడీ తొమ్మిదేళ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు.

Also Read : Peddireddy: వైఎస్ జగన్ పేదలకు మంచి చేస్తే నచ్చని వాళ్ళందరూ ఏకమవుతున్నారు..

అంతేకాకుండా.. ‘రాష్ట్రంలో కేసీఆర్ తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారు. రాష్ట్రానికి ఏం సాధించారని తెలంగాణ రన్ నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలి. యూనివర్సిటీ లను మూతవేసే దిశగా కేసీఆర్ తీసుకెళ్తున్నారు. విద్యార్థులకు , యూనివర్సిటీ లకు కేటాయిస్తున్న నిదులు తగ్గిపోతున్నాయి. ఉద్యోగ కల్పన విషయంలో కేటీఆర్ చెప్పేదానికి.. వాస్తవానికి చాలా గ్యాప్ ఉంది. బీఆర్ఎస్ ది నో డేటా అవేలబుల్ ప్రభుత్వం. రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.

Also Read : Gongura Rice : గోంగూర రైస్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు..

కొత్త జిల్లాల్లో అనేక పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు. 2018మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలేదు అమలు చేయని మేని పేస్టోను చింపి , తగలబెట్టాలి. పకోడీ అమ్మినా, చాయ్ అమ్మినా మేం సిగ్గు పడం. ఎవరికి ఎందులో ప్రావీణ్యం ఉందో అందులో ఉపాధి పొందుతారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చింపి తగలబెట్టిన బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయలేదంటూ ఆగ్రహం.
నిరుద్యోగ భృతి ఇస్తానంటూ మ్యానిఫెస్టోలో పొందుపరిచి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఇలాంటి మేనిఫెస్టో అవసరమా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version