Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp High Command Focus On Telangana Key Changes In T Bjp

BJP: తెలంగాణపై హైకమాండ్ ఫోకస్‌.. కమలం పార్టీలో కీలక మార్పులు..?

Published Date :June 10, 2023 , 10:17 pm
By Sudhakar Ravula
BJP: తెలంగాణపై హైకమాండ్ ఫోకస్‌.. కమలం పార్టీలో కీలక మార్పులు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP: తెలంగాణలో బీజేపీ నేతల మధ్య గొడవలను సమసిపోయేలా చేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ హైకమాండ్‌..రాష్ట్ర పార్టీ నేతలంతా కలసికట్టుగా పనిచేసేలా చూడడంపై దృష్టి కేంద్రీకరించింది. కీలక నేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్‌ పెరుగుతుందని, తద్వారా ఎన్నికల్లో దూసుకుపోవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సీరియస్‌గా కసరత్తు చేస్తోంది హైకమాండ్. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై కొంతకాలంగా కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న నేతలకు, కొత్తగా చేరిన నేతలకు మధ్య గ్యాప్‌ పెరిగడంతో ఈ అంతరాన్ని తగ్గించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తోంది.

బండి సంజయ్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే ఆ స్థానంలోకి ఎవరు వస్తారు..అంటే…ప్రధానంగా వినిపిస్తున్న పేరు డీకే అరుణ. ఒక వేళ బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగిస్తే… డీకే అరుణకు ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఈటల రాజేందర్‌కు కూడా కీలక బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ బన్సల్‌ ఒక్కరే ఉంటారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. కీలకమైన ఈ మార్పుచేర్పులన్నీ నాలుగైదు రోజుల్లోనే జరగనున్నట్లు కమలనాథుల నోట ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15న ఖమ్మంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పర్యటించనున్నారు. ఖమ్మంలో అమిత్‌ షా భారీ బహిరంగసభకు ముందుగానే ఈ మార్పులు చేస్తారని తెలుస్తోంది.

Also Read

  • MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
  • Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
  • Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..

తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్పుచేర్పులపై బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ నాయకత్వాల్లోనే కాదు, కేంద్ర కేబినెట్‌లోనూ మార్పు చేర్పులుంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా అటు కేంద్ర కేబినెట్‌లో కానీ, ఇటు తెలంగాణ బీజేపీ నాయకత్వంలో కానీ సామాజిక వర్గాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని మార్పులు జరగనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandi Sanjay Kumar
  • bjp
  • BJP high command
  • DK Aruna
  • Etala Rajendar

తాజావార్తలు

  • MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..

  • Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..

  • Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..

  • Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..

  • Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions