Site icon NTV Telugu

Delhi Assembly Elections: బీజేపీ రెండో జాబితా విడుదల.. ఎవరెవరికి చోటు దక్కిందంటే?

Bjp

Bjp

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నిన్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా పలువురు నాయకులు హాజరయ్యారు. కాగా.. తాజా జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కపిల్ మిశ్రాను కరవాల్ నగర్ నుంచి, హరీష్ ఖురానాకు మోతీ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చారు. ఈ జాబితాలో ఐదుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు.

READ MORE: Plastic: ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ వస్తుందా?

త్రినగర్ నుంచి తిలక్ రామ్ గుప్తాకు పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. సుల్తాన్‌పూర్ మజ్రా అభ్యర్థిగా కర్మ సింగ్ కర్మను ప్రకటించింది. ఢిల్లీ కరావాల్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కపిల్ మిశ్రాను పార్టీ అభ్యర్థిగా నిలబెడుతోంది. లక్ష్మీనగర్ నుంచి అభయ్ వర్మకు మరోసారి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం లక్ష్మీ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అభయ్ వర్మ ఉన్నారు. అంతకుముందు జనవరి 4 న కూడా బీజేపీ 29 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఇందులో న్యూఢిల్లీ, కల్కాజీ వంటి అనేక హై ప్రొఫైల్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

READ MORE: Maharashtra: పండగ వేళ మహా విషాదం.. ఫోన్ కొనలేదని కొడుకు ఆత్మహత్య.. ఆవేదనతో తండ్రి కూడా సూసైడ్

Exit mobile version