Site icon NTV Telugu

BJP: విపక్షాలను విమర్శిస్తూ ఓ పాటను విడుదల చేసిన బీజేపీ

Bjp

Bjp

విపక్ష పార్టీలను విమర్శిస్తూ బీజేపీ పార్టీ ఓ పాటను ట్విట్టర్ వేదికగా వీడియోను పోస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తారీఖు వరకు అవిశ్వాసంపై లోక్ సభలో చర్చ జరిగింది. అవిశ్వాసంపై విపక్ష కూటమిపై ప్రధాని మోడీ నిన్న ( గురువారం ) ఆన్సర్ ఇచ్చారు. విపక్షాలపై తన పదునైన విమర్శలను ప్రధాని గుప్పించారు. మోడీ ప్రసంగంలో విపక్షాలపై విమర్శలను ఆధారంగా చేసుకుని బీజేపీ ఓ పాటను రెడీ చేసింది. అయితే, ఈ పాటను బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.

Read Also: Gudivada Amarnath: అప్పుడు లేవని నోరు, ఇప్పుడెందుకు లేస్తోంది పవన్?

హృదయంలోనే ప్రేమ ఉంటుందని.. ఇది దుకాణంలో దొరకదని విపక్ష పార్టీలపై బీజేపీ పార్టీ సెటైర్లు వేసింది. తొమ్మిది సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేసిన పథకాలు అన్నింటిని ఆ పాటలో ప్రస్తావించారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ప్రజలకు జరిగిన అన్యాయాల గురించి కూడా అందులో చెబుతూ.. విమర్శించింది.

Read Also: Indhuja Ravichandran: ఆ ముద్ర వేస్తారనే భయంతో అలా చేయడం లేదు!

అయితే, ఛాన్స్ దొరికినప్పుడల్లా కమలం పార్టీ విపక్షాలపై విరుచుకుపడుతుంది. మణిపూర్ అల్లర్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో లోక్ సభలో ప్రకటన చేయించాలనే ఉద్దేశ్యంతోనే మోడీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు ప్రకటించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై ప్రతిరోజూ పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. అయితే, బీజేపీ విడుదల చేసిన ఈ పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Exit mobile version