Indhuja Ravichandran: ఆ ముద్ర వేస్తారనే భయంతో అలా చేయడం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేయాదమాన్’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసి ఆ తరువాత బిల్లా పిండి, మహాముని, ముకుత్తి అమ్మన్, నానే వరువేన్ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఇందుజా రవిచంద్రన్. ప్రస్తుతం హరీష్ కళ్యాణ్‌కు జంటగా పార్కింగ్ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇందుజా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్ ఉంటుందని అలాగే తనకు నటించడంలోనే కిక్ కలుగుతుందని తెలిపింది. సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఇందుజాని అనుకోనని పాత్ర స్వభావాన్ని బట్టి మారడం తనకు కిక్ ఇస్తుందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
ఇక పార్కింగ్ సినిమాకి సంబంధించిన పలు విషయాలను కూడా ఈ సందర్భంగా ఇందుజా పంచుకున్నారు. పార్కింగ్ చిత్రంలో తాను టీచర్ గా నటిస్తున్నానని చెప్పింది. పార్కింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? వాటి ద్వారా జరిగే పరిణామాలు? తదితర అంశాలను బేస్ చేసుకొని ఈ సినిమా ఉంటుందని దాంొత పాటు పలు ఆసక్తికరమైన ఘటనలు ఈ చిత్రంలో ఉంటాయని తెలిపింది. అయితే ఈ సినిమాలో తన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందని కొన్ని ఛాలెంజింగ్ సన్నివేశాల్లో నటించానని చెప్పింది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
Also read : Pawan Kalyan: రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల పరిశీలనకు పవన్.. పోలీసులు పర్మిషన్ ఇచ్చేనా..?
హీరోయిన్ గా నటించాలనే ధ్యేయంతోనే ఈ రంగంలోకి వచ్చానని, అయితే ఆరంభంలో ఆఫర్లు రాక కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశానని తెలిపింది. అయితే అలాగే వరుసగా అలాంటి పాత్రల్లోనే నటిస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ముద్ర వేస్తారని భావించి ప్రస్తుతం కథానాయిక పాత్రలకే పెద్దపీఠ వేస్తున్నట్లు పేర్కొంది. అయితే సినిమాల్లో్కి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న కొన్ని అవమానాలను కూడా ఇందుజా ఈ సందర్భంగా తెలిపింది. తాను తమిళ్ అమ్మాయినని చెప్పగా ఆరంభ దశలో కొంతమంది హేళనగా చూశారని… ఎందుకు అలా చూస్తున్నారో అప్పుడు అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయంటుంది ఈ చిన్నది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రావడంతో ప్రేక్షకులు అన్ని చిత్రాలనూ చూస్తున్నారని చెప్పింది.మంచి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోనని చెప్పుకొచ్చింది ఇందుజా.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!