NTV Telugu Site icon

Pinarayi Vijayan: తగిన గుణపాఠం చెప్పారు.. కర్ణాటక ఎన్నికలపై కేరళ సీఎం కీలక వ్యాఖ్యలు

Kerala Cm

Kerala Cm

Kerala Chief Minister Pinarayi Vijayan: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు దేశానికి సానుకూల భవిష్యత్తును తెలియజేస్తున్నాయని, ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పాలన లేదని, కర్ణాటక ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో 10 రోజుల పాటు ప్రచారం చేసి అరడజను రోడ్ షోలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత తహతహలాడిందో దీన్నిబట్టి తెలుస్తోంది. ప్రజలు కూడా ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నారు.’ అని పినరయి విజయన్‌ అన్నారు.

Read Also: Bandi Sanjay : హిందుత్వం లేకుండా భారతదేశం లేదు

భారత ఎన్నికల సంఘం ప్రకారం.. కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్ణాటకలో 66 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. జనతాదళ్-సెక్యులర్ (జేడీఎస్) 19 స్థానాలను కైవసం చేసుకుంది.కాంగ్రెస్‌ గతం నుంచి నేర్చుకోవాలి. బీజేపీ ప్రతిపక్షంలో ఉండి సంతృప్తి చెందదు. ఎన్నికల్లో ఓడిపోయినా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నించింది. గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నానికి మద్దతిచ్చారని.. మళ్లీ పునరావృతం కాకుండా కాంగ్రెస్‌ అధినాయకత్వం జాగ్రత్త వహించాలని కేరళ సీఎం సూచించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదనే భావన దేశంలో నెలకొందని అన్నారు. పార్లమెంట్‌లో సంపూర్ణ మెజారిటీతో దేశాన్ని పాలించినప్పుడు కాంగ్రెస్‌ గతంలో ఉండేది కాదని ప్రస్తావిస్తూ.. ‘‘దేశాన్ని కాంగ్రెస్‌ సుదీర్ఘకాలం ఒంటరిగా పాలించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలా లేవు. బీజేపీని అధికారం నుంచి దింపడమే లక్ష్యం.. అందులో కాంగ్రెస్‌ కూడా పాలుపంచుకోవాలి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి తీరని లోటు అని ఆయన అన్నారు.