Site icon NTV Telugu

Gaon Chalo Abhiyan: గావ్ ఛలో అభియాన్‌కు బీజేపీ శ్రీకారం..

Gaon Chalo Abhiyan

Gaon Chalo Abhiyan

Gaon Chalo Abhiyan: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ.. తమ పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది.. దాని కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేస్తోంది.. అందులో భాగంగా.. ఏపీలో బీజేపీ ఇవాళ్టి నుంచి గ్రామాల్లో పర్యటించేలా గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం మొదలుపెట్టనుంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగులో గావ్ ఛలో కార్యక్రమాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రారంభిచనున్నారు. గ్రామాలలో బీజేపీ నేతలు, కార్యకర్తలను కలవడం, ఆలయాల సందర్శన, స్వచ్చభారత్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత గ్రామాల్లో ఆరోగ్యకేంద్రాలు, సచివాలయాల పనితీరు తెలుసుకుంటారు. అనంతరం బూత్ కమిటీ సభ్యలతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు బీజేపీ నేతలు..

Read Also: China Vs India: అమెరికా దెబ్బకి.. భారత్తో దోస్తీకి చైనా ప్లాన్

తొలి రోజు కార్యక్రమానికి సంబంధించిన వివరాలు గమనిస్తే..
* ఉదయం మేడికొండూరు మండల మాజీ అధ్యక్షులు ఆమతి వెంటరమణ గృహ సందర్శన
* దేవాలయంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం
* ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం పరిశీలన
* గ్రామ సచివాలయ సందర్శన
* బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశం
* మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 వరకు భోజన విరామం.
* 2.30 తర్వాత రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు..

Exit mobile version