కర్ణాటకలో (karnataka) పరీక్ష సమయాల మార్పుపై (Exam timings) అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ప్రీ యూనివర్సిటీ పరీక్షల సమయాలను సర్దుబాటు చేస్తూ మైనారిటీలను మభ్యపెడుతోందని బీజేపీ ఆరోపించింది.
ఇటీవల SSLC మరియు ప్రీ-యూనివర్శిటీ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. అయితే శుక్రవారం మాత్రం SSLC పరీక్షా సమయం ఉదయం నుంచి మధ్యాహ్నానికి మార్చారు. దీంతో ప్రతిపక్ష పార్టీ బీజేపీ (BJP) మండిపడింది. అన్ని పరీక్షలు ఉదయం నిర్వహించి శుక్రవారం మాత్రం షెడ్యూల్‌కు భిన్నంగా మధ్యాహ్నం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ నిలదీసింది. ముస్లిం సమాజాన్ని శాంతింపజేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, ఉదయం నమాజ్ చేసుకునేందుకు వీలుగానే సమయం మార్చారని బీజేపీ అధికార ప్రతినిధి హరిప్రకాష్ ఆరోపించారు.
బీజేపీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ (Congress) ఖండించింది. వేరే పరీక్షా సమయాలను సర్దుబాటు చేయడానికి ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 1న పీయూసీ పరీక్ష ప్రారంభం కావడంతో అదే రోజు మధ్యాహ్నం ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష జరగనుంది. పరీక్షల సమయాన్ని సర్దుబాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.
SSLC కోసం ప్రిపరేటరీ పరీక్షలు ఫిబ్రవరి 26న ప్రారంభమై మార్చి 2న ముగియనుండగా, పీయూసీ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి.