BJP: ఏపీలో పొత్తులపై ఒకట్రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఒకట్రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది. అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అధిష్ఠానం పెద్దలు.. అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు లిస్ట్‌ను రెడీ చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. పొత్తుపై స్పష్టత కోసం టీడీపీ, జనసేనలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీ కొంత మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ కోరుతున్న స్థానాలను పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. బీజేపీ నుంచి స్పష్టత వచ్చాకే ఈ రెండు పార్టీలు ముందడుగు వేయాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో పొత్తు విషయంపై క్లారిటీ రానుంది. ఈ విషయం తేలిన అనంతరం ఏపీ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Delhi: పార్టీలకు ఈసీ హెచ్చరికలు.. ఆ ప్రకటనలు చేయొద్దని వార్నింగ్!
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవలే భేటీ అయ్యి కీలకాంశాలపై చర్చించారు. అయితే పొత్తుపై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీంతో రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే రేపు, ఎల్లుండి (శని, ఆదివారం) బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనున్న నేపథ్యంలో పొత్తుపై ఏమైనా క్లారిటీ వస్తుందా అనే చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
-
AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!