NTV Telugu Site icon

BJP: ఏపీలో పొత్తులపై ఒకట్రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ!

Bjp

Bjp

BJP: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఒకట్రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది. అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అధిష్ఠానం పెద్దలు.. అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు లిస్ట్‌ను రెడీ చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. పొత్తుపై స్పష్టత కోసం టీడీపీ, జనసేనలు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీ కొంత మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ కోరుతున్న స్థానాలను పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. బీజేపీ నుంచి స్పష్టత వచ్చాకే ఈ రెండు పార్టీలు ముందడుగు వేయాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో పొత్తు విషయంపై క్లారిటీ రానుంది. ఈ విషయం తేలిన అనంతరం ఏపీ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Delhi: పార్టీలకు ఈసీ హెచ్చరికలు.. ఆ ప్రకటనలు చేయొద్దని వార్నింగ్!

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవలే భేటీ అయ్యి కీలకాంశాలపై చర్చించారు. అయితే పొత్తుపై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీంతో రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే రేపు, ఎల్లుండి (శని, ఆదివారం) బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనున్న నేపథ్యంలో పొత్తుపై ఏమైనా క్లారిటీ వస్తుందా అనే చర్చ మొదలైంది.