NTV Telugu Site icon

BJP Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఢిల్లీ విజయోత్సవ సంబరాలు

Bjp

Bjp

BJP Celebrations: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు నేడు (ఆదివారం) ఘనంగా జరిగాయి. గతంలో సికింద్రాబాద్‌లో బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో విజయోత్సవాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. బీజేపీ కార్యకర్తలు బ్యాండ్ వాయిస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తల ఉత్సాహం మధ్య కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి డా. లక్ష్మణ్ ప్రసంగించారు.

Read Also: Kaleshwaram: కాళేశ్వరంలో ఘనంగా మహాఘట్టం మహాకుంభాభిషేకం.. హాజరైన మంత్రులు

ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతోందని, ఢిల్లీలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. అలాగే తెలంగాణలో కూడా త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని, దేశమంతా కమలం వికసిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఢిల్లీ తరహా పాలన కోరుకుంటున్నారని.. డబుల్ ఇంజన్ సర్కార్‌ తెలంగాణలో రావాలన్నది ప్రజల ఆకాంక్షగా తెలిపారు. అంతేకాకుండా రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు ఆయన అన్నారు. ఈ విజయోత్సవం రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తానికి బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో సాధించిన విజయంతో తెలంగాణలో కూడా అదే విధమైన ఫలితాలపై నమ్మకం వ్యక్తం చేశారు.