NTV Telugu Site icon

Rani Rudrama: కేటీఆర్ను గద్దె దించి సిరిసిల్లలో నన్ను గెలిపించండి

Rani

Rani

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యే పేరు గుర్తు ఉందా అని గ్రామాల్లో అడిగితే ఒక్కసారి కూడా కనపడలేదు అని అంటున్నారన్నారు. 14 ఏళ్లుగా గెలిచిన కేటీఆర్ కు సిరిసిల్లలో సొంత ఇల్లు ఉందా ప్రశ్నించారు. తాను గెలిచినా.. ఓడినా ఇక్కడే ఉంటా.. ఇల్లు కూడా కట్టుకుంటున్నానని తెలిపారు. 114 గ్రామాలు తిరిగానని.. ప్రతి సమస్య తనకు తెలుసన్నారు. 10 ఏళ్లలో ఒక్క ఆసరా పెన్షన్, రేషన్ కార్డులు వచ్చాయా అని రాణి రుద్రమ ప్రశ్నించారు.

G.V.L Narasimha Rao: కమ్యూనిస్టు పార్టీలకు అడ్రస్‌ లేకుండా పోయింది..

సిరిసిల్లలో వేల కోట్లు దోచుకొని అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడని కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. సిరిసిల్లలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా అని అన్నారు. అయ్యా ఏక్ నంబర్, కొడుకు దస్ నంబర్ దగాకొర్ అని దుయ్యబట్టారు. ప్రతి పథకంలో లంచాలు తీసుకొని పనులు చేస్తున్నాడని ఆరోపించారు. కేటీఆర్ అనుచరులు దళిత బందు, బీసీ బందులో లంచాలు తీసుకొని బ్రోకరిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో 10 మంది దొరలను తయారు చేసుకొని పాలిస్తున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ రోడ్డు మీదకు వస్తే దొరలు అతని కాన్వాయ్ లో ఉంటారని ఆరోపించింది.

Shivraj Singh Chouhan: రాహుల్ గాంధీ ‘జాతీయ సమస్య’గా మారాడు..

బతుకమ్మ చీరెలు ఉత్పత్తి అయ్యాకా 5 వేయిల పవర్లూమ్ సంచెలు తుక్కు కిందా అమ్ముకున్నారని రాణి రుద్రమ ఆరోపించారు. ఆనాడు సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. చేనేత కార్మికుల కోసం పవర్ లుమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని.. చేనేత కార్మికులను మోడీ దగ్గరికి తీసుకెళ్ళి వారి కోరికలు నెరవేర్చేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు. 14 ఏళ్లుగా నియోజకవర్గంలో ఒక్క రోజు ఉండని కేటీఆర్.. ఇప్పుడు వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటానని అంటున్నాడన్నారు. కేటీఆర్ దొరను గద్దె దించి సిరిసిల్లలో తనను గెలిపించాలని అక్కడి ప్రజలను కోరారు. బీజేపీని ఆశీర్వదిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు.

Show comments