Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bjp Candidate Arunas Victory

Mahabubnagar: సీఎం సొంత ఇలాఖాలో కాంగ్రెస్ కు షాక్..బీజేపీ అభ్యర్థి అరుణ ఘన విజయం

Published Date :June 4, 2024 , 5:12 pm
By RAMAKRISHNA KENCHE
Mahabubnagar: సీఎం సొంత ఇలాఖాలో కాంగ్రెస్ కు షాక్..బీజేపీ అభ్యర్థి అరుణ ఘన విజయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీఎం సొంత ఇలాఖా లో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు. కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు లీడ్ వచ్చింది. కాని మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేటలో బీజేపీ మెజార్టీ ఓట్లు సాధించింది. పోస్టల్ బ్యాలెట్ లోనూ బీజేపీ పై చేయి కనబరిచింది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పదిసార్లు పర్యటించిన కాంగ్రెస్ కి విజయం దక్కలేదు. పాచికలు పారలేదు.. అభివృద్ధి, సంక్షేమ మంత్రం పని చేయలేదు.

READ MORE: Kadiyam Kavya: కడియం కావ్య ఘన విజయం..మెజార్టీ ఎంతంటే?

కాగా.. జూన్ 2న విడుదలైన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందడం విశేషం. తమకు మళ్లీ స్థానం దక్కడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. తాజాగా ఎంపీ సీటును బీజేపీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ వ్యక్తమవుతోంది. మరోవైపు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం ఆ సీటును సైతం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. 2 లక్షల మెజార్టీతో ఈటల రాజేందర్‌ గెలుపొందారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BJP Candidate
  • CM Revanth Reddy
  • Devarakadra
  • DK Aruna
  • Lok Sabha Election 2024

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions