సీఎం సొంత ఇలాఖా లో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు. కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు లీడ్ వచ్చింది. కాని మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేటలో బీజేపీ మెజార్టీ ఓట్లు సాధించింది. పోస్టల్ బ్యాలెట్ లోనూ బీజేపీ పై చేయి కనబరిచింది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పదిసార్లు పర్యటించిన కాంగ్రెస్ కి విజయం దక్కలేదు. పాచికలు పారలేదు.. అభివృద్ధి, సంక్షేమ మంత్రం పని చేయలేదు.
READ MORE: Kadiyam Kavya: కడియం కావ్య ఘన విజయం..మెజార్టీ ఎంతంటే?
కాగా.. జూన్ 2న విడుదలైన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందడం విశేషం. తమకు మళ్లీ స్థానం దక్కడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. తాజాగా ఎంపీ సీటును బీజేపీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ వ్యక్తమవుతోంది. మరోవైపు.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం ఆ సీటును సైతం బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. 2 లక్షల మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపొందారు.