ఏపీలో నిధుల కోసం సర్పంచులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ఏపీ బీజేపీ మద్దతు ఇచ్చింది. సర్పంచ్‌ల హక్కుల సాధన కోసం పోరుబాట పడుతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయనుంది. పంచాయతీల నిధులను జగన్ ప్రభుత్వం అక్రమంగా దోచుకోవడం వల్ల.. గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని ఏపీ బీజేపీ చీఫ్ ప్రశ్నించారు. గ్రామ స్వరాజ్యం రావాలని కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలొడ్డుతోందని ఆమె ఆరోపించారు.
Read Also: Rajini Kanth: నీలాంబరి ముందు నా పరువు తీసేశావు కదా.. డైరెక్టర్
అయితే, నేడు రాష్ట్ర నేతలు అందరూ జిల్లా కేంద్రాలలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఒంగోలు జిల్లాలో జరిగే ప్రొగ్రాంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొంటారు. విజయవాడలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, కాకినాడలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అరకులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, అనకాపల్లిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు ఆందోళనకు దిగనున్నారు.
Read Also: Cruel Husband: భార్యను కాపురానికి పంపించలేదని.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు
ఇక, హిందుపూర్ లో ఏపీ సహ ఇంఛార్జ్ సునీల్ దేవదర్, కర్నూలులో మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్ధసారధి, తిరుపతిలొ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మచిలీపట్నంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుసాంబశివరావు, గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నెల్లూరులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణలు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక సీనియర్ బీజేపీ నేత హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంది.