NTV Telugu Site icon

Daggubati Purandeswari: సీఎం చంద్రబాబుకు పురంధేశ్వరి లేఖ..

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. పలు కీలక అంశాలను ఈ లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఏపీ బీజేపీ చీఫ్‌.. ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చేయాలని కోరిన ఆమె.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రమాణాలను పాటిస్తూ ఇసుక తవ్వకాలు జరగాలి.. భారీ మెషీన్లతో ఇసుక తవ్వకాలు జరపకూడదు అని సూచించారు.. ఇదే సమయంలో గత ఐదేళ్లలో జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని కోరారు.. టాటా, బిర్లాల ద్వారా శుద్ధి చేసిన ఇసుక 25 కేజీల బస్తాలలో అందించేలా చూడాలన్నారు..

Read Also: NET-NEET Paper Leak : నెట్-నీట్‌లో అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్న కాంగ్రెస్

మరోవైపు.. మద్య నియంత్రణ, క్వాలిటీ లిక్కర్ పై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు పురంధేశ్వరి.. ఇప్పటి వరకూ ఉన్న డిస్టిలరీస్ పై విచారణ జరిపించాలి.. ముడి సరుకుల వినియోగం, లిక్కర్ తయారీ పై విచారణ జరగాలన్నారు. ఇథనాల్ కంటే సగం ఖర్చుతో లభించే సింథటిక్ ఆల్కహాల్ వినియోగంపై విచారణ జరగాలి.. కాలం చెల్లిన డిస్టిలేషన్, శుద్ధి యంత్రాల వినియోగం పరిశీలించాలి.. కలర్, ఫ్లెవర్ల కోసం సింథటిక్ కెమికల్స్ వినియోగంపై విచారణ చేయించాలి.. 6 నుంచీ 12 నెలలు చెక్క బ్యారెల్స్ లో నిల్వ ఉంచిన ఆల్కహాల్ ను బాటిళ్ళలో నింపేలా చూడాలి.. శాంపిల్స్ ను ప్రతీవారం నేషనల్ లేబొరేటరీలలో పరీక్షలు జరిపించాలి.. డిజిటల్ చెల్లింపులను పూర్తిస్ధాయిలో అమలు పరచాలి.. పరివర్తన తీసుకొచ్చేందుకు రిహేబిలిటేషన్ సెంటర్లను రాష్ట్రం అంతా ప్రారంభించాలి.. బలవంతంగా లీజుకు తీసుకున్న లిక్కర్ తయారీ కేంద్రాలను తక్కువ రేట్లకే తిరిగి తీసుకోవాలి.. బ్రూవరీస్ కార్పొరేషన్ లో కరప్షన్ పై విచారణ జరిపించాలి అంటూ సీఎం చంద్రబాబు దృష్టికి తన లేఖ ద్వారా తీసుకెళ్లారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.