NTV Telugu Site icon

MLC Jeevan Reddy: మోడీ అహంకార ధోరణి వల్లే ఆర్ఎస్ఎస్ అసహనం

Jeevan Reddy

Jeevan Reddy

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు చేసే రైతులకే రైతు బంధు పెట్టుబడి సహాయం ఇస్తామని తెలిపారు. గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, బీడు భూములకు రైతు బంధు ఎందుకు అని ప్రశ్నించారు. సర్కార్ సోమ్ము అంటే అలుసా.. ఆదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం 60 లక్షల కోట్ల రూపాయల రాయితీని ఇచ్చింది అని వెల్లడించారు. పంజాబ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కనువిప్పు కావాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Saripodhaa Sanivaaram : నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..

ఇక, ఎక్కడైతే మతం ఆరంభం అయిందో అక్కడే ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ప్రతికులంగా వెలుగులోకి వచ్చాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ అహంకార ధోరణితో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) తీవ్ర అసహనం వ్యక్తం చేసిందన్నారు. మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరి మీద నేను ఆరోపణలు చేయలేదు.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడే మాటల తీరు చూస్తుంటూ బీఆర్ఎస్ నాయకులు చట్టానికి అతీతమా అన్నట్టు అనిపిస్తుందన్నారు.. ప్రతి ఒక్కరు చట్టానికి కట్టుబడి ఉండాలి.. ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.