Site icon NTV Telugu

Telangana BJP : సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘించారు.. బీజేపీ ఫిర్యాదు

Tbjp

Tbjp

Telangana BJP : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. ఇలా మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఒక వర్గం ఓట్లు ప్రభావితం అవుతాయన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ‘మంత్రివర్గ విస్తరణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం, చర్యలు తీసుకోవాలని కోరాం. ఒక వర్గానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు పాయల్ శంకర్.

Read Also : Revanth Reddy : వరంగల్ కు సీఎం రేవంత్.. ముంపు ప్రాంతాల్లో పర్యటన

కవేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే ఎన్నిక తర్వాత ఇవ్వాలి. కానీ ఉన్నఫళంగా మంత్రివర్గ విస్తరణ చేయడం, అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. మర్రి శషిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల లబ్ది కోసం ఒక వర్గం ఓట్లు కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఆ వర్గంపై ప్రేమ ఉంటే గతంలో ఎందుకు ఇవ్వలేదు. మంత్రి పదవి ఆశ చూపి ఆ వర్గాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కోడ్ ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకోవాలంటూ కోరాం. సినీ కార్మికుల ను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేయడంకోడ్ ఉల్లంఘనే అవుతుందన్నారు.

Read Also : KTR : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే హామీలు అమలు చేస్తారు.. కేటీఆర్ ట్వీట్

Exit mobile version