యాదాద్రి జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఉప్పల్ కు చెందిన బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం అతను తన తల్లిని కొట్టడమే. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా రాజు తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తన తల్లి కొట్టొద్దని వేడుకున్నా సరే విచక్షణ కోల్పోయి తల్లిని చెంప మీద కొట్టాడు. కాలితో తన్నాడు. అయితే ఈ సమయంలో అక్కడున్న వారు వారిస్తున్నా రాజు మాత్రం పట్టించుకోలేదు.
Also Read:Ranbir Kapoor: నెపొటిజం అంటారు కానీ.. ఇంటి పేరు నిలబెట్టడం అంత ఈజీ కాదు
ఈ తతాంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియో వైరల్ కావడంతో తన పరువు పోయిందని.. నేను నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేనంటూ మనోవేధనకు గురయ్యాడు. సెల్పీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు బీజేపీ కార్యకర్త రాజు. ఆయన మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మృతుడి భార్య మహిమ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
