Bill Gates : ఎప్‌స్టీన్ వివాదం.. తప్పు ఒప్పుకున్న బిల్‌గేట్స్.. కానీ!

Bill Gates

Bill Gates

Bill Gates : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం’లో.. జెఫ్రీ ఎప్‌స్టీన్ అక్రమ దందాలకు సంబంధించిన కీలక పత్రాలు బయటకు రావడం, అందులో బిల్‌గేట్స్ పేరు కూడా ఉండటంతో సర్వత్రా చర్చ మొదలైంది. ఈ వివాదంపై తాజాగా బిల్‌గేట్స్ నోరు విప్పారు. తాను చేసిన పొరపాట్లను అంగీకరిస్తూనే, కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు. తన ఫౌండేషన్ సభ్యులకు క్షమాపణలు చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌కు ఉన్న సంబంధమేంటి? ఆ రష్యన్ మహిళల కథేంటి? మెలిందా గేట్స్ హెచ్చరించినా ఆయన ఎందుకు వినలేదు? అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

READ ALSO: Ragi Daliya Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంట్లోనే చేసుకోండి ‘రాగి ధలియా’!

బిల్‌గేట్స్ తాజాగా ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేర్కొన్నట్లుగా, తనకు ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధం ఉన్న మాట వాస్తవమేనని బిల్‌గేట్స్ అంగీకరించారు. అయితే, ఆ మహిళలకు ఎప్‌స్టీన్ సాగిస్తున్న అక్రమ దందాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మైనర్లపై అక్రమ వేధింపుల కేసులో ఎప్‌స్టీన్ దోషిగా తేలిన తర్వాత కూడా (2011లో) అతడితో కలవడం తాను చేసిన పెద్ద తప్పని గేట్స్ విచారం వ్యక్తం చేశారు. అతడి నేపథ్యాన్ని సరిగ్గా తెలుసుకోకుండానే చర్చలు జరిపానని, ఆ సమయంలో తన ఫౌండేషన్ సభ్యులను కూడా అతడి దగ్గరకు తీసుకెళ్లడం పెద్ద పొరపాటని ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒప్పుకున్నారు. ఎప్‌స్టీన్‌తో భేటీ అయిన మాట వాస్తవమే అయినా, తాను ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడలేదని బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్ అసిస్టెంట్లు తనతో ఫోటోలు దిగారని, కానీ వారితో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పారు.

తన మాజీ భార్య మెలిందా గేట్స్, ఎప్‌స్టీన్ విషయంలో మొదటి నుంచీ అనుమానంగానే ఉన్నారని ఆయన తెలిపారు. ఆమె ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, తాను అతడితో పరిచయాన్ని కొనసాగించానని, అది తన తప్పేనని ఆయన అంగీకరించారు. అమెరికా న్యాయశాఖ ఇటీవల ఎప్‌స్టీన్ కేసులో దాదాపు 30 లక్షల పేజీల దర్యాప్తు పత్రాలను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఆ జాబితాలో తన పేరు ఉండటంతో బిల్‌గేట్స్ తాజాగా వివరణ ఇచ్చారు.

READ ALSO: PM Modi: ఇజ్రాయెల్‌ గడ్డపై అడుగుపెట్టిన మోడీ.. తొలి భారత ప్రధానమంత్రిగా రికార్డ్!