Bihar Floor Test: బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంపై విశ్వాసం కోరుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌధరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత నితీష్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.బిహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ నేత అవథ్ బిహారీ చౌదరీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ యాదవ్ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 125 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయడం వల్ల ఆయన స్పీకర్ పదవి నుంచి తొలిగించారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 112 మంది ఓటు వేశారు. దీంతో ఇప్పుడు జరిగే ప్రభుత్వ బలపరీక్షలోనూ ఇలానే జరగనుందని తెలుస్తోంది.
Read Also: Supreme Court: డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేతన్ ఆనంద్, నీలం దేవి, ప్రహ్లాద్ యాదవ్ అసెంబ్లీలో ప్రభుత్వ పక్షాన కూర్చున్నారు. అయితే ఓటింగ్ ముగిసే వరకు ఎమ్మెల్యేలు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని, లేకుంటే ఓటు చెల్లుబాటు కాదని మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఎన్డీయేలో చేరడం ప్రతిపక్ష మహాఘటబంధన్ కూటమికి పెద్దదెబ్బగా మారింది. బీహార్‌లో ఇటీవలే ఏర్పడ్డ ఎన్డీఏ కూటమి బలపరీక్షలో ఉత్కంఠ కొనసాగుతోంది. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 122. బలపరీక్షలో తమ కూటమికి 127 ఓట్లు వస్తాయని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది.