Crime News: తల్లిదండ్రులు తమ కొడుకుకు మంచి సంబంధం చూశారు. పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. అప్పటివరకు ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్న యువకుడు స్వదేశానికి రావడంతో కుటుంబసభ్యులు పెళ్లి హడావుడిలో నిమగ్నమయ్యారు. కాసేపల్లో పెళ్లి జరగాలి. ఇంతలో షాక్.. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైల్లే ట్రాక్ పై మీ కొడుకు శవం ఉందన్నారు. ఆ తల్లిదండ్రులకు పెళ్లికి వచ్చిన వాళ్లకు ఏం అర్థం కాలేదు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో ని గోపాల్ గంజ్ ప్రాంతంలో జరిగింది.
Read Also: Prithvi Shaw: పృథ్వీ షా ఎవరో కూడా నాకు తెలియదు: సప్నా గిల్
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నికేష్ కుమార్ రాత్రి ఇంట్లో నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు విస్తృతంగా వెతికారు. అయితే యువకుడి జాడ లేదు. ఆ తర్వాత రైల్వే ట్రక్కుపై యువకుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
Read Also: Chandrababu: చంద్రబాబుపై కేసు.. మరో ఆరుగురు టీడీపీ నేతలపై కూడా
సుందర్ పట్టి గ్రామానికి చెందిన నికేశ్ కుమార్ మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. యువకుడి మృతికి గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పెళ్లికి ముందు రోజు రైలు పట్టాలపై యువకుడి మృతదేహం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పోలీసులు యువకుడి మృతదేహాన్ని కనుగొన్న రోజు, అదే రోజు అతను వివాహం చేసుకోవలసి ఉంది. హత్య, ఆత్మహత్య అనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లికొడుకు చనిపోవడంతో గ్రామమంతా విచారం వ్యక్తం చేస్తోంది.