Site icon NTV Telugu

Bihar court: సహారా అధినేత సుబ్రతా రాయ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Subrata Roy

Subrata Roy

Bihar court: బీహార్‌లోని నలందాలోని వినియోగదారుల కోర్టు సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బీహార్ పోలీసులు, లక్నో పోలీసుల బృందాలు వారెంట్‌తో శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సహారా నగరానికి చేరుకుని రాయ్ కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. లక్నోలోని సుబ్రతా రాయ్‌కి సంబంధించిన కార్యాలయం, ఇల్లు, ఇతర ప్రాంగణాల్లో పోలీసులు సోదాలు చేశారు. రాయ్‌ని అరెస్టు చేసేందుకు ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఖాసిం అబిది తెలిపారు.

Bombay High Court: కానిస్టేబుల్ పోస్టులకు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకోవచ్చు..

సోదాల్లో కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయని, దాని ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. అయితే ఈ ఉత్తర్వుల అమలుపై కోర్టు స్టే విధించిందని సహారా నుంచి ఒక ప్రకటన పేర్కొంది. సహారా బ్యాంకింగ్‌లో పెట్టుబడిదారుడు నలంద వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేయడంతో వారెంట్ జారీ చేయబడింది. అయితే సమన్లు ​​జారీ చేసినప్పటికీ సుబ్రతా రాయ్ కోర్టుకు హాజరు కాలేదు.

Exit mobile version