Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.
- 47 ఏళ్ల మద్యం నిషేధానికి ముగింపు.
- కొత్త ఎక్సైజ్ నిబంధనలతో లైసెన్స్ ఆధారిత విక్రయాలకు అనుమతి.
- పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే కేంద్రం ప్రధాన లక్ష్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshadweep: కేంద్రపాలిత ప్రాంతం, ముస్లిం మెజారిటీ ఉన్న లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 47 ఏళ్లగా ఉన్న నిషేధానికి కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకువచ్చింది. నియంత్రిత విధానంలో లైసెన్స్ పొందిన దుకాణాల ద్వారా మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. ఈ చర్య లక్షద్వీప్ పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఏడాది క్రితం లక్షద్వీప్ సందర్శనకు ప్రధాని మోడీ వెళ్లిన తర్వాత, ఆ ప్రాంతానికి పర్యాటకులు వెళ్లడం ఎక్కువైంది.
1973 నుంచి నిషేధం, ఎందుకు..?
1973 నుంచి లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. అప్పటి నుంచి అమలులో ఉన్న ‘‘లక్షద్వీప్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్’’ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేుసింది. దీని స్థానంలో కొత్తగా ‘‘ లక్షద్వీప్ ఎక్సైజ్ రెగ్యులేషన్ -2026’’ను అమలులోకి తెచ్చింది. జూన్ 5 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త చట్టం ప్రకారం.. మద్యం తయారీ, స్వాధీనం, దిగుమతి, ఎగుమతి, రవాణా, కొనుగోలు, అమ్మకం,వినియోగాన్ని నియంత్రించే లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్లు మరియు ఏజెన్సీలు మద్యం దిగుమతి, రిటైలింగ్ కోసం లైసెన్సులు పొందేందుకు కూడా అనుమతిస్తుంది.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
లక్షద్వీప్ జనాభాలో సుమారు 97 శాతం మంది ముస్లింలే. ఇస్లా్ంలో మద్యం సేవించడం నిషేధం. దీంతో 1979లో మద్య విక్రయాల నిషేధం అమలులోకి వచ్చింది. దశాబ్ధాలుగా అక్కడి రాజకీయ పార్టీలు, పలు సంస్థలు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి. అయితే, కవరత్తి, బంగారం ద్వీపాల్లోని కొన్ని పర్యాటక రిసార్టులు, ప్రభుత్వ నిర్వహణ బార్లలో మినహాయింపు ఉండేది.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఎత్తివేత:
లక్షద్వీప్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరో మాల్దీవులుగా దీనిని తీర్చిదిద్దాలనుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ 2024 లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. 2020లో కేవలం 3875 మంది పర్యాటకులు మాత్రమే వెళ్తే, 2024 నాటికి ఈ సంఖ్య 68 వేలకు చేరింది.
భారీ పన్నులు..
నియంత్రిత విధానంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చినప్పటికీ, పన్నులు మాత్రం భారీగా ఉన్నాయి. . ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) మరియు విదేశీ మద్యంపై 400%, బీర్‌పై 200%, వైన్‌పై 80% ఎక్సైజ్ సుంకాలను నిర్ణయించారు.
లక్షద్వీప్ గురించి..
లక్షద్వీప్ 36 ద్వీపాల సమూహం. వాటిలో అగట్టి, అమిని, ఆండ్రోట్, బిట్రా, చెట్లట్, కడ్మత్, కల్పేని, కవరట్టి, కిల్తాన్ మరియు మినీకాయ్తో సహా 10 ద్వీపాలలో జనావాసం ఉంది. విదేశీయులు, భారతీయ పర్యాటకులు ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుంది. విదేశీ పర్యాటకులు కేవలం అగట్టి, బంగారం, కడ్మత్ ద్వీపాల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ 36 ద్వీపాల్లో 10 ద్వీపాల్లో ప్రజలు ఉంటే, మరో 17 దీవుల్లో జనావాసాలు లేవు. కొత్తగా మరో 4 చిన్న దీవులు ఏర్పడ్డాయి.
తాజావార్తలు
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!