Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషుల కలలు కేవలం స్కూల్ పుస్తకాల నుంచే కాకుండా, జీవితంలోని కష్టాల నుంచి కూడా పుట్టుకొస్తాయని నిరూపించారు బిహార్‌కు చెందిన బబ్లీ కుమారి. బోధ్‌గయలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బబ్లీ, ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను చూస్తూ పెరిగారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మిన ఆమె, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2013 లో పెళ్లయినప్పటికీ, కుటుంబానికి ఆర్థిక ఆసరా అందించాలనే పట్టుదలతో 2015 లో బిహార్ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. సాధారణంగా ఉద్యోగం వస్తే చాలామంది అక్కడితో సరిపెట్టుకుంటారు, కానీ బబ్లీ ఆశయం అంతటితో ఆగలేదు.
ఆమె బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్ష రాసి ఒక ఉన్నతాధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పోలీస్ శాఖలో 20 గంటల కఠినమైన డ్యూటీలు చేస్తూ చదవడం అంత సులువు కాలేదు. విధి నిర్వహణలో దొరికిన కొద్దిపాటి సమయాన్ని కూడా ఆమె పుస్తకాలతో గడిపేవారు. ఈ ప్రయాణంలో అత్యంత కఠినమైన ఘట్టం ఏమిటంటే, ఆమె బీపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో గర్భవతిగా ఉన్నారు. ఒకవైపు డ్యూటీ, మరోవైపు ఆరోగ్యం, ఇంకోవైపు పరీక్షల సిలబస్ ఉన్నప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. చదువు కోసం తగిన సమయం దొరకకపోవడంతో, సెలవు పెట్టి పాట్నా వెళ్లి తీవ్రంగా శ్రమించారు.
Also Read
ఈ ప్రస్థానంలో బబ్లీ మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా తన తప్పులను సరిదిద్దుకుని, మూడోసారి మరింత పట్టుదలతో పరీక్ష రాశారు. 2022 లో విడుదలైన 66వ బీపీఎస్సీ ఫలితాల్లో ఆమె ఆల్ ఇండియా 208వ ర్యాంక్ సాధించి, నేరుగా డీఎస్పీ (DSP) స్థాయి అధికారిణిగా ఎంపికయ్యారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి కఠినమైన డ్యూటీ, గర్భధారణ సమయం, వరుస వైఫల్యాలను తట్టుకుని నిలబడిన బబ్లీ కుమారి కథ ఎందరో మహిళలకు ఆదర్శప్రాయం. తన విజయానికి భర్త, అత్తమామల ప్రోత్సాహమే కారణమని ఆమె గర్వంగా చెబుతారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..