Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: బీహార్ రాజధాని పట్నా రోడ్లు మంగళవారం రణరంగాన్ని తలపించాయి. వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నివాసాన్ని ముట్టడించేందుకు దూసుకెళ్లారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించే 70వ పరీక్షను వెంటనే రద్దు చేయాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఈ ఆందోళన చేపట్టారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో చారిత్రాత్మక గాంధీ మైదాన్ నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ క్రమంగా తీవ్రరూపం దాల్చింది. నిరసనకారులు ముఖ్యమంత్రి నివాసం వైపు దూసుకెళ్లకుండా పోలీసులు మార్గమంతటా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ, ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు వాటిని తోసుకుంటూ ముందుకు సాగారు. బారికేడ్లను బద్దలు కొట్టుకుని వస్తున్న అభ్యర్థులను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు పలుచోట్ల లాఠీఛార్జ్ చేయడంతో పాటు వాటర్ కెనన్లను ప్రయోగించారు. అయినా సరే వెనక్కి తగ్గని విద్యార్థులు, పోలీసుల హెచ్చరికలను దాటుకుంటూ సీఎం నివాసానికి చేరువగా వెళ్లడం విశేషం.
నిజానికి పట్నాలోని గర్దానీబాగ్ ప్రాంతంలో పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు కొద్దిరోజులుగా నిరంతర నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారుల ప్రతినిధులతో ప్రభుత్వం సోమవారం జరిపిన చర్చలు సానుకూలంగానే ముగిసినప్పటికీ, తమ ప్రధాన డిమాండ్లు నెరవేరేవరకు వెనక్కి తగ్గేది లేదని అభ్యర్థులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గాంధీ మైదాన్ నుంచి సీఎం నివాసానికి మార్చ్‌ను ప్రకటించి అమలు చేశారు. ప్రభుత్వం తరఫున కేవలం జూనియర్ అధికారులతో మాట్లాడించి విషయాన్ని దాటవేస్తున్నారని, ఈసారి నేరుగా ముఖ్యమంత్రే తమతో చర్చలు జరపాలని విద్యార్థి నేత సౌరవ్ కుమార్ స్పష్టం చేశారు. తమ తరఫున ఒక ప్రతినిధి బృందాన్ని సీఎం లేదా విద్యాశాఖ మంత్రి వద్దకు పంపడానికి సిద్ధంగా ఉన్నామని, వారిద్దరూ తప్ప వేరే ఏ అధికారితోనూ మాట్లాడేది లేదని, సీఎం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నిరసన విరమిస్తామని విద్యార్థి నాయకులు తేల్చి చెప్పారు.
Also Read
ఒకవైపు అభ్యర్థుల ఆందోళనలు ఉధృతంగా సాగుతుండగానే, మరోవైపు బీహార్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ‘విద్యార్థి సహయోగ్ శివిర్’ పేరిట ఒక నూతన కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రతి నెల నాలుగో మంగళవారం నాడు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తామని, విద్యార్థులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని సీఎం సమ్రాట్ చౌధరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా, విద్యార్థులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా ‘1100’ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఎంతటి సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినప్పటికీ, 70వ BPSC పరీక్ష అక్రమాలపై కచ్చితమైన చర్యలు తీసుకునేవరకు పోరాటాన్ని ఆపేది లేదని నిరుద్యోగ అభ్యర్థులు భీష్మించుకూర్చోవడంతో పట్నాలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!