NTV Telugu Site icon

Marriages: ఏంట్రా బాబు.. ఆ ఊళ్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు..

Marriges

Marriges

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. అలాంటిది యువత తల్లిదండ్రులు యుక్త వయసు రాగానే తమ పిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ కొందరు మంచి చదువులు చదువుకుని, ఉన్నతమైన ఉద్యోగంలో స్థిర పడిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇక, ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలను పెళ్లి చేసుకొవాలంటే కొన్ని క్వాలిటీస్ చూస్తున్నారు. కానీ, బీహార్‌లోని ఓ గ్రామంలో ఎంత ప్రయత్నించినా అబ్బాయిలకు పెళ్లిళ్లు జరగవు.

Read Also: OYO: ఓయోలో మంచంపై యువతి.. ఉరేసుకున్న యువకుడు.. అసలేమైంది?

అయితే, కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయి శాలరీ, ప్రాపర్టీ, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివి చూస్తున్నారు. ఈ క్రమంలో శాలరీ, ప్రాపర్టీ తక్కువగా ఉన్న వారి పెళ్లిళ్లు తొందరగా సెట్ కావడం లేదు. మరి కొందరి అమ్మాయిల తల్లిదండ్రులు జాతకాలు చూసి పెళ్లిళ్లు చేస్తుండటంతో అబ్బాయిలు, అటు అమ్మాయిల పెళ్లిళ్లు ఆలస్యం కావడానికి కారణం అవుతున్నారు.

Read Also: Diwali Holidays: రేపటి నుంచి స్కూళ్లకు 3 రోజులు సెలవులు

కానీ, బీహార్‌లోని ఓ గ్రామంలో ఎంత ప్రయత్నించినా అక్కడి అబ్బాయిలకు మ్యారేజ్ లు జరగటం లేదట. జముయి జిల్లా సదర్ ప్రధాన కార్యాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరుఅట్టా విలేజ్ లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారంట. ఈ ఊరి యువకులు ఉద్యోగాల కంటే పెళ్లి చేసుకోవడానికే ఎక్కువగా కష్టపడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, పెళ్లి చేసుకున్న అబ్బాయిలు తమ వివాహ జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Read Also: PAK vs ENG: ఇంగ్లండ్‌ జట్టును డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టి తాళం వేయండి.. వసీం అక్రమ్‌ మాస్టర్‌ ప్లాన్‌!

అయితే, పెళ్లి చేసుకునేందుకు అనేక సంబంధాలు వస్తున్నాయి.. కానీ వాటిలో ఒక్కటి కూడా సెట్ కావడం లేదు. దీనికి కారణం తెలిస్తే మీరు షాక్ అవుతారు. బారుఅట్ట గ్రామంలోని వార్డు నంబర్ 5లోని మహాదళిత కాలనీలో సుమారు 50 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. కానీ, వారి ఇంటి వరకు రోడ్డు లేకపోవడంతో వర్షకాలం సమయంలో ఇంటి ముందు మొత్తం బురదమయంగా మారుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు తమ ఆడబిడ్డలను బురద మార్గంలో పంపించడానికి ఇష్ట పడటం లేదు అనేది ఇక్కడ వినిపిస్తున్న ప్రధాన కారణం.