NTV Telugu Site icon

Bigg Boss Telugu 8: పట్టుకొనే ఉండు.. లేకపోతే పగిలిపోతుంది.. ఎట్టకేలకు పృథ్వీ చెప్పేసాడుగా.!

Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8: ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 25వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమో సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో బిగ్ బాస్ ఓ బెలూన్ పెట్టి అందులో.. పోటీదారులు మునిగిపోయేలా చేసి దాంతో కొన్ని విషయాలను రాబట్టాడు. ఇందులో భాగంగా విష్ణు ప్రియ పై ఉన్న ప్రేమను పృథ్వి బయట పెట్టాలా చేశాడని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో విశేషాలను.. అసలు పృథ్వి, విష్ణుప్రియ మధ్య ఏం జరిగిందన్న విషయాలను ఒకసారి చూద్దాం..

World Environmental Health Day 2024: నేడే ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారంటే.?
గత ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ లోకి మరో 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు రాబోతున్నాయని.. వాళ్ళని హౌస్ లోకి రాకుండా ఉండాలంటే మీరు 12 టాస్క్ లను విజయవంతంగా గెలవాల్సి ఉంటుందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టాస్కులు జరపగా అందులో ఒక టాస్క్ గెలిచి, మరో రాసుకోవడం ఓడిపోయారు హౌస్ మేట్స్. దీంతో ఒక్క వైల్డ్ కార్డు ఎంట్రీ ని ఆపగలిగారు కంటెస్టెంట్స్. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా.. ” పట్టుకొని ఉండు.. లేకపోతే పగిలిపోతుంది” అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా కాంతారా టీం నుండి నబిల్, శక్తి టీం నుంచి పృథ్వి లో పాల్గొన్నారు. వీరిద్దరూ కాస్త స్ట్రాంగ్ అవడంతో ఎవరు విన్ అవుతారు అనే విషయంపై ఆసక్తికంగా ప్రోమోను రూపొందించారు.

ఇక ఫ్రేమ్ మీద హ్యాండిల్ కు బెలూన్ కట్టి ఉన్నారు. పక్కనే ఉన్న బెలూన్ కి తగలకుండా చూసుకోవాలంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా టాస్క్ సీరియస్ గా కొనసాగుతున్న సమయంలో మణికంఠ పాట పాడడంతో లేడీ కంటెస్టెన్స్ అందరూ నవ్వుతూ కనబడ్డారు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సడన్ గా పృథ్విని ఓ పాట పడమని ఆదేశిస్తాడు. పృథ్వి మన కోసం ఓ పాట పాడుతాడంటూ బిగ్ బాస్ అనగానే.. యానిమల్ సినిమాలోని “ఎవరెవరో.. నాకు ఎదురైనా..” పాటను పాడడం మొదలుపెడతాడు. దాంతో వెంటనే పోటీలో ఉన్న నబిల్ హౌస్ లో ఈ పాటను ప్రతి ఎవరికోసం పాడుతున్నాడు అడగండి అంటూ బిగ్ బాస్ కోరుతాడు. వెంటనే పృథ్వి హౌస్ లో అయితే విష్ణు ప్రియ కోసం అంటూ తన మనసులో మాటను బయటకు చెప్పేస్తాడు. ఈ నేపథ్యంలో మొదటి రోజు కాఫీ ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు నుండి ఇంకా ట్రై చేస్తున్న విష్ణు ప్రియ ఈ మాట విని తెగ ఆనంద పడిపోయింది. దింతో మొత్తానికి ఇన్ని రోజుల నిరీక్షణకు బ్రేక్ పడినట్లు అయింది. అయితే పృద్వి జస్ట్ ఫర్ క్రియేట్ చేయడానికి ఇలా చేశాడా..? లేకపోతే నిజంగానే లవ్ ట్రాక్ మొదలుపెట్టాడానికి సిద్ధమయ్యాడ..? అనే విషయం మాత్రం వేచి చూడాల్సిందే.

Show comments