NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ గెలవాలని అభిమాని ఏం చేశాడో తెలుసా?

Pallavi Prasanth

Pallavi Prasanth

తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బుల్లితెర పై స్టార్ మాలో కొనసాగుతున్న ఏకైక షో.. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడో సీజన్ ను విజయవంతంగా జరుపుకుంటుంది.. ఆ సీజన్ కూడా ఈ వారంతో ముగియ్యనుంది.. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా కామన్ మ్యాన్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. టాప్ లో అతని పేరే వినిపిస్తుంది..

ఈ సీజన్ విన్నర్ రేసులో ప్రశాంత్ ఉన్నాడు.. ఒక కామన్ అయ్యి సెలెబ్రేటీలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది.. అతన్ని విన్నర్ ని చెయ్యడం కోసం అభిమానులు బయట విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. తాజాగా ఓ అభిమాని చేసిన పనికి జనాలు అవాక్కవుతున్నారు.. చిట్యాల గ్రామానికి చెందిన ప్రశాంత్ అభిమాని సైకిల్ యాత్ర చేపట్టాడు. చిట్యాల నుండి బిగ్ బాస్ హౌస్ కి ఆయన సైకిల్ మీద రానున్నాడు. మొత్తంగా 150 కిలోమీటర్లు సైకిల్ యాత్ర పూర్తి చేయనున్నాడు.. ఇది తెలిసిన చాలా మంది అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు..

తన అభిమాని బిగ్ బాస్ టైటిల్ గెలవాలని సైకిల్ యాత్ర చేయడం ఇదే మొదటిసారి. అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ని అటాక్ చేస్తున్నాడు. ప్రశాంత్ ని తక్కువగా చూస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడని ఆ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.. ప్రశాంత్ ను గెలిపించండి.. అంటూ వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు.. టైటిల్ పోరు ప్రధానంగా అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్ మధ్య జరగనుంది. ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ కొడతారని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం.. మరి ఎవరు విన్నర్ గా నిలుస్తారో తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..