Bigg Boss Season 7: సహనం కోల్పోయిన శివాజీ.. హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్7 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి అడుగుపెట్టింది.. పదోవ రోజు బిగ్ బాస్ హౌస్ లో రసవత్తరంగా మారింది.. హౌజ్‌లో ఎవరూ కన్ఫమ్ కాదనే ట్విస్ట్ తో ఈ షో ప్రారంభమైంది. పవర్ అస్త్ర దక్కించుకుంటేనే హౌజ్‌లో కన్ఫమ్ అవుతారు.. అలా గత వారంలో సందీప్ పవర్ అస్త్రని సాధించి ఐదు వారాలా ఇమ్యూనిటీ పొందాడు. హౌజ్‌లో కన్ఫమ్ అయ్యారు. ఇప్పుడు రెండో వారంలో పవర్ అస్త్ర కోసం హౌజ్ మేట్స్ మధ్య యుద్ధం జరుగుతుంది. పవర్ అస్త్ర దక్కించుకోవాలంటే ముందుగా మాయాస్త్రని సొంతం చేసుకోవాలనే నిబంధన పెట్టాడు బిగ్ బాస్..
ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ రెండు టీమ్ లు గా విడిపోయారు.. రణధీర, మహాబలి అనే రెండు గ్రూపులుగా విభజించాడు. శివాజీ, షకీలా, యావర్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలు రణధీర గ్రూప్‌లో ఉన్నారు. తేజ, పల్లవి ప్రశాంత్, రతిక, శుభ శ్రీ, దామిని, గౌతం కృష్ణ మహా బలి గ్రూప్‌లో ఉన్నారు. నిన్న జరిగిన బల నిరూపన టాస్క్ లో రణ ధీర టీమ్ విన్నర్‌గా మాయాస్త్రకి సంబంధించిన ఓ కీ ని సాధించింది.. కట్ చేస్తే.. ఈ టీమ్ లో రణ ధీర టీమ్ మాయాస్త్రని సాధించారు. అందులో ఉన్న ఆరు చక్రాలను ఆరుగురు సభ్యులు తీసుకున్నారు. దీంతో రణధీర టీమ్ ఆనందానికి అవదుల్లేవ్. కానీ అంతలోనే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. రణధీర టీమ్ సభ్యుల మధ్యే చిచ్చుకి స్కెచ్ వేశాడు.. ఆరుగురు మాత్రం పాల్గొనాలని ట్విస్ట్ ఇచ్చాడు..
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా..ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడుతున్న యావర్‌కి బిగ్ బాస్ శిక్ష వేశాడు. ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడుతున్నందుకు సారీ చెబుతూ కంటిన్యూగా ఆయా పదాలను పలుకుతూ ఉండాలి. యావర్‌ని డిస్టర్బ్ చేసేందుకు మహాబలి టీమ్ ఎంతో శ్రమించింది. ఈ క్రమంలో శివాజీ సహనం కోల్పోయాడు. యావర్‌ని మరింతగా ఇబ్బంది పెడుతుంటే, చూడలేక సీరియస్ అయ్యాడు. కాసేపు వేడెక్కించే ప్రయత్నం చేశాడు.. మరోవైపు పవర్ అస్ర్తలను కొట్టేసేందుకు, మాయాస్త్రకి సంబంధించిన కీని దొంగిలించేందుకు మహాబలి టీమ్ కుట్రలు పన్నింది. ఎట్టకేలకు సందీప్ సాధించిన పవర్ అస్ర్తని శుభ శ్రీ దొంగిలించింది. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.. ఈ వారం ఎలా ఉండబోతుంది అనే ఆసక్తిగా మారింది.. మరి నామినేట్ అయిన వారిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో తెలియాలంటే ఈ వారం మిస్ అవ్వకుండా బిగ్ బాస్ ను చూడాల్సిందే..
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..