Bigg Boss Telugu 7 : గౌతమ్ ఇంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో ఆర్భాటంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 ఒక దుర్ఘటనతో ముగుస్తుందని ఎవరూ కూడా ఊహించలేదు. కంటెస్టెంట్స్ అంతా ఎంతో ఆనందంతో, బిగ్ బాస్ జర్నీ ముగించుకొని బయటకు వస్తే కొందరు ఆకతాయిలు వారి సంతోషాన్ని అంతా దూరం చేశారు. రన్నర్ గా నిలిచిన అమర్దీప్ తో పాటు అశ్విని మరియు గీతూ కార్లపై కూడా దాడి చేసారు..బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ ర్యాలీ నిర్వహించడం వల్లే గొడవ పెద్దది అయ్యిందని పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు. రెండురోజులు చంచల్గూడ జైలులో శిక్ష అనుభవించిన తర్వాత ప్రశాంత్ కు బెయిల్ దొరికింది. కానీ మిగతా కంటెస్టెంట్స్ ఇదేమీ పట్టించుకోకుండా ఆనందంగా పార్టీ చేసుకున్నారు.బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ నయని పావని, టేస్టీ తేజ, శుభశ్రీ, ప్రియాంక, యావర్, గౌతమ్ మరియు అర్జున్ కలిసి తాజాగా పార్టీ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలు సోషల్ మీడియాల్లో షేర్ చేసుకున్నారు. ప్రియాంక ఈ పార్టీకి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేసింది. గౌతమ్ ఇంట్లో ఈ డిన్నర్ పార్టీ జరిగిందని ప్రియాంక ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.
అందులో వారంతా జోకులు వేసుకుంటూ ఎంతో సరదాగా కనిపించారు. శోభా రాలేదని తేజ ఫీల్ అవుతున్నాడని ప్రియాంక వెటకారంగా మాట్లాడగా.. యశ్వంత్తో బిజీగా ఉందని గౌతమ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత వారిపై వచ్చిన మీమ్స్ అన్నింటినీ చూసి ఎంతగానో ఎంజాయ్ చేశారు. పోల్ డ్యాన్స్ చేయమంటూ పావని తేజను ఆటపట్టించింది. పార్టీలో నయని పావని, యావర్ను హగ్ చేసుకుంటూ కనిపించింది. శుభశ్రీ గౌతమ్ తో ఎక్కువగా ముచ్చట్లు పెట్టింది. దీంతో అసలు తనకు పెయిర్ లేరని తేజ తెగ ఫీల్ అయిపోయాడు. అందరు జంటలు అయిపోయారు.. తానే ఒంటరి అయిపోయానని అన్నాడు.అయితే ఈ పార్టీకి మరికొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రాలేదు. శివాజీ, రతిక, శోభా శెట్టి మరియు అశ్వినితో పాటు పలువురు మిస్ అయ్యారు. అప్పుడే ప్రియాంక అప్లోడ్ చేసిన ఈ పార్టీ వీడియోకు దాదాపుగా నాలుగున్నర లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో కింద కామెంట్స్లో చాలామంది ప్రశాంత్ అరెస్ట్ను పట్టించుకోకుండా కంటెస్టెంట్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..