NTV Telugu Site icon

Big Twist in Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్‌లో బిగ్‌ ట్విస్ట్..!

Vamsi Arrest

Vamsi Arrest

Big Twist in Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు ఏపీ పోలీసులు.. వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్నారు వల్లభనేని వంశీ.. అయితే, ఈ కేసులో తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్.. ఈ కేసులో ఇవాళ కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ పోలీసులు.. రాయదుర్గం పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశారు.. అరెస్ట్‌ సందర్భంగా పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారట వంశీ.. కేసు కోర్టులో ఉండగా.. తనను ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ పోలీసులతో వాదించగా.. ఇది మరో కేసు అంటూ.. పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు..

Read Also: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!

అయితే, తాజాగా తనకు ఆ ఫిర్యాదుతో సంబంధం లేదని కోర్టులో సత్యవర్ధన్ అఫిడవిట్ వేయటంతో.. ఫిర్యాదుదారుడ్ని బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వల్లభనేని వంవీపై మరో కేసు నమోదు చేశారట పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు సత్యవర్ధన్‌.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యవర్ధన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.. కానీ, 4 రోజుల క్రితం తన ఫిర్యాదు వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్.. కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.. కేసుకు తనకి సంబంధం లేదని.. కావాలని పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం పేరుతో కేసు పెట్టారని.. పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ కేసులో ఊహించని ట్విస్ట్‌ వచ్చి చేరినట్టు అయ్యింది.. ఈ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనుంది విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం.. అక్కడే ఇప్పుడు రివర్స్‌ ట్విస్ట్‌ వచ్చి చేరింది..

Read Also: Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!

సత్యవర్ధన్‌ను బెదిరించినట్లుగా సెల్‌ఫోన్‌ ఆడియో రికార్డులు పోలీసులకు లభ్యమయ్యాయి.. సత్యవర్ధన్ కులం పేరుతో బెదిరించి.. కిడ్నాప్ పాల్పడ్డట్టుగా తేల్చారు పోలీసులు.. సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీతో పాటు అతడి అనుచరులపై కేసు నమోదు చేశారు.. వంశీతో పాటు అనుచరులు బెదిరింపు వల్లే కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు సత్యవర్ధన్.. దీంతో.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కేసు విత్ డ్రాలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.. ఈ కేసులో తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు సత్యవర్ధన్.. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది.. దీంతో, సత్యవర్ధన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు.. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని సత్యవర్ధన్‌ చెప్పడంతో.. మరో కేసు నమోదు చేశారు.. దీనితో వల్లభనేని వంశీ ఆయన అనుచరులుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. సత్యవర్ధన్ ను ఆ రోజు కోర్టుకు తమ కారులోనే వంశీ అనుచరులు తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది.. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురుపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు..