NTV Telugu Site icon

AUS vs AFG: ఆస్ట్రేలియా ముందు బిగ్ టార్గెట్.. ఆఫ్గాన్ స్కోరు ఎంతంటే..?

Aus Vs Afg

Aus Vs Afg

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. కాగా.. ఆఫ్గాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను పెవిలియన్‌ బాట పట్టాడు. ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. సత్యవర్థన్ స్టేట్మెంట్ ఇవ్వాలని పిటిషన్

ఆఫ్గానిస్తాన్ బ్యాటర్లలో సెదికుల్లా అటల్ 85 పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్‌లో 95 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ 67 పరుగులు చేశాడు. ఆఫ్గాన్ బ్యాటర్లలో రెహమత్ షా 12, కెప్టెన్ షాహిది 20 పరుగులు చేసి ఔటయ్యాడు. నబీ ఒక్క పరుగుకే రనౌట్ అయ్యాడు. గుల్బాదిన్ 4, రషీద్ ఖాన్ 19, నూర్ అహ్మద్ 6 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. స్పెన్సర్ జాన్సన్, ఆడం జంపా తలో 2 వికెట్లు పడగొట్టారు. నాథన్ ఇల్లీస్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ సంపాదించారు.

Read Also: SLBC Incident : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న 8మంది సజీవ సమాధి