BRS MLA Joins Congress: బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరారు. చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్‌కుమార్‌లు హస్తం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
BRS MLA Joins Congress: బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే
- బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్
- కాంగ్రెస్ పార్టీలో చేరిన కాలె యాదయ్య

Kale Yadaiah