టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ కు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దూరంగా ఉండనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో రోహిత్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో.. మహ్మద్ షమీ గురించి కీలక ప్రకటన చేశాడు. ” షమీని.. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయడం కష్టం, అతని మోకాళ్లు వాచాయి. అతను NCA (నేషనల్ క్రికెట్ అకాడమీ, బెంగళూరు)లో ఉన్నాడు. వైద్యులు, ఫిజియోల పర్యవేక్షణలో ఉన్నాడు. కోలుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు” అని రోహిత్ శర్మ చెప్పారు.
రోహిత్ మాట్లాడుతూ.. “ఒక ఫాస్ట్ బౌలర్ చాలా క్రికెట్‌ను కోల్పోయాడు, అకస్మాత్తుగా అతను అత్యుత్తమ ప్రదర్శన చేయడం అనువైనది కాదు, అతనికి కోలుకోవడానికి మరియు 100 శాతం ఫిట్‌గా ఉండటానికి తగినంత సమయం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. షమీ.. అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ముందు కొన్ని (ప్రాక్టీస్) మ్యాచ్‌లు ఆడాలని” రోహిత్ శర్మ తెలిపారు. భారత్ తరఫున మహమ్మద్ షమీ 64 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 27.71 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు. కాగా.. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాలో భారత్ ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
Read Also: Ananya Panday : బ్లాక్ డ్రెస్సులో కనిపించి కనిపించని అందాలతో అదరహో అనిపిస్తున్న అనన్య
మహ్మద్ షమీ తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్‌ను నవంబర్ 2023లో ఆడాడు. అది 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్. ఈ టోర్నీలో అతను గాయంతోనే ఆడాడు. తరువాత అతను కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. అతను కొన్ని సందర్భాల్లో నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించినప్పటికీ.. పూర్తిగా ఫిట్‌గా లేడు. అతను ఫిట్‌గా మారడానికి పునరావాస ప్రక్రియలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని మోకాలి వాపు వచ్చింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి దాదాపు రెండు నెలలు పట్టవచ్చు. అందుకే ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం సాధ్యం కాదు.