Site icon NTV Telugu

Kane Williamson: కివీస్‌కు భారీ షాక్.. కేన్ మామకు సర్జరీ.. వరల్డ్ కప్ ఆడటం డౌటే..?

Points Table

Points Table

వన్డే వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ కు క్రికెట్ కు భారీ షాక్ తగిలింది. పరిమిత ఓవర్లలో ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్.. అక్టబర్ నుంచి భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో ఆడేది అనుమానంగానే ఉంది. ఐపీఎల్ -16 సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న కేన్ మామ.. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఆడుతూ గాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోబోతూ గాయపడ్డాడు.. దీంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.

https://twitter.com/PrithishNarayan/status/1642094161120690176

Read Also : Babies in the canal: కాలువలో శిశువుల మృతదేహాలు.. ఓ వస్త్రంలో ఇద్దరిని కట్టి..

కుడి మోకాలికి గాయం కారణంగా కేన్ మామకు సర్జరీ చేసుకున్నాడుని సమాచారం. రుతురాజ్ క్యాచ్ పట్టే క్రమంలో గాల్లోకి ఎగిరి కింద పడే క్రమంలో విలియమ్సన్ మోకాలు గ్రౌండ్ కు బలంగా తాకింది. దీంతో మోకాలి ఎముకకు బలమైన గాయం అయినట్లు స్కాన్ లో వెల్లడికావడంతో సర్జరీ తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. రెండ్రోజుల క్రితమే ఐపీఎల్ తప్పుకుని న్యూజిలాండ్ కు వెళ్లిన కేన్ మామ.. కివీస్ లో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడని తెలుస్తోంది. ఒకవేళ సర్జరీ చేయించుకుంటే అతడు కనీసం ఐదు నుంచి ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. ఆ తర్వాత కూడా ఫిట్నెస్ సాధించి తిరిగి క్రికెట్ ఆడటం అంటే మాటలు కాదు.

Read Also : Vandebharat: తెలుగు రాష్ట్రాల వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. రాకపోకల్లో ఆలస్యం

అయితే కేన్ విలియమ్సన్ అక్టోబర్ నుంచి భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడటం అనుమానమేనని న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా తనకు గాయమైన తర్వాత కేన్ మామ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో పాటు గుజరాత్ టైటాన్స్ నుంచి నేను ఊహించని మద్దతు పొందతున్నాను.. ఈ సందర్భంగా వారిని నా ధన్యవాదములు తెలుపుతున్నా.. టోర్నీ ప్రారంభంలోనే గాయపడటం కాస్త నిరాశే అయినప్పటికీ ప్రస్తుతం నా దృష్టి మొత్తం సర్జరీ మీదే ఉంది.. అని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version