NTV Telugu Site icon

Team India: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు బిగ్ షాక్..!

Jasprit Bumrah

Jasprit Bumrah

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను తొలగించారు. మంగళవారం భారత వన్డే జట్టు ప్రకటించినప్పుడు బుమ్రా పేరు జట్టులో లేదు. ఈ సిరీస్ గురువారం (ఫిబ్రవరి 6) నుండి ప్రారంభం కానుంది. బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్ నుండి తప్పుకున్నాడు, దీనివల్ల 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కోసం అది పెద్ద టెన్షన్‌గా మారింది. బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదో టెస్టు సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు.

జట్టు నుంచి బుమ్రా పేరును తొలగించిన విషయం పై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) అధికారికంగా ఏమైనా వివరణ ఇవ్వలేదు. అయితే, జనవరిలో బీసీసీఐ జట్టును ప్రకటించినప్పుడు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బుమ్రా మొదటి రెండు వన్డేల్లో ఆడుతాడని చెప్పారు. కానీ ఇప్పుడు బుమ్రా మూడవ వన్డేలో కూడా ఆడకపోవడంతో, అతను సిరీస్ నుండి పూర్తిగా తప్పుకున్నాడు. అయితే ముందుగా బుమ్రా రెండు వన్డేలకూ అందుబాటులో ఉండడని పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి ఎంపిక చేశారు.

Read Also: Delhi Elections: సీఎం అతిషిపై ఎఫ్‌ఐఆర్.. ఏం కేసు బుక్ చేశారంటే..!

ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) చివరి మ్యాచ్‌లో వెన్ను కండరాల నొప్పి కారణంగా బుమ్రా రెండవ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. అతనికి ఐదు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. BGTలో బుమ్రా అద్భుత బౌలింగ్ తో 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. అయితే.. బుమ్రా త్వరగా కోలుకుని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి తుది జట్టు ఫిబ్రవరి 11 నాటికి ఐసీసీకి సమర్పించాలి. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది.

ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ , కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ మరియు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్.