NTV Telugu Site icon

Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్.. చేవేళ్ల ఠాణాలో కేసు నమోదు

New Project (13)

New Project (13)

బీఆర్ఎస్ మాజీ జీవన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. అతడితో పాటు అతని కుటుంబ సభ్యుల పై చేవెళ్ల పీఎస్ లో కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేశారని బాధితుడు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఎర్లపల్లి లో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశారు. సర్వేనెంబర్ 32, 35, 36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నారు.దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. దీంతో 2023లో అక్కడున్న ఫంక్షన్ హాల్ ను కూల్చేసిన జీవన్ రెడ్డి ఆ భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ ను కాపలాగా పెట్టారు. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై పంచాబ్ గ్యాంగ్ దాడికి పాల్పడింది.

READ MORE: Laila Khan Murder Case: బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసు.. సవతి తండ్రికి మరణశిక్ష విధించిన కోర్టు..

మరణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు గురించేంది. ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఇటీవలే అద్దె బకాయిలు రూ. 2.50కోట్లు డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని ఆయన షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు. షాపింగ్ మాల్ గేటుకు తాళం వేశారు ఆర్టీసీ అధికారులు. షాపింగ్ మాల్ లో ఉన్న దుకాణదారులను బయటకు పంపించేశారు. వెంటనే మాల్ ఖాళీ చేయాలంటూ దుకాణదారులను హెచ్చరించారు. అది మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.