Maharashtra: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న వివాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కరించింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కలిగిన అజిత్ పవార్ వర్గానికే పార్టీ చిహ్నం, గుర్తును ఈసీ కేటాయించింది. దీంతో పాటు నిధులు, బ్యాంక్ అకౌంట్లపై అజిత్ వర్గానికి నియంత్రణ కూడా దక్కనుంది. ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం హర్షం వ్యక్తం చేయగా.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని శరద్ పవార్ వర్గం తెలిపింది.
Read Also: Australian: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో తొలిసారి భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎంపీ..
ఇక, ఎన్నికల సంఘం నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అజిత్ పవార్ వర్గం తరపు న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ ద్వారా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. శరద్ పవార్ వర్గం ఏదైనా పిటిషన్ దాఖలు చేస్తే తమ పక్షం కూడా వినాలని అజిత్ పవార్ వర్గం పేర్కొంది. కోర్టు ఏకపక్షంగా స్టే విధించకూడదు అని వారు కోరారు.
Read Also: Autos Allowed on Yadadri: యాదాద్రి కొండపైకి ఆటోల అనుమతి.. ఎప్పటి నుంచి అంటే..
అయితే, ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత ముంబైలోని ఎన్సీపీ కార్యాలయం బయట శరద్ పవార్, సుప్రియా సూలే, రోహిత్ పవార్ పోస్టర్లు వెలిశాయి. ఈ రోజు కూడా మేం గెలిచాం.. గుర్తు మీదే, మా నాన్న అని ఈ పోస్టర్‌లో రాసి ఉంది. దీంతో పాటు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోగా కొత్త పేర్లను సూచించాలని శరద్ పవార్ వర్గాన్ని ఎన్నికల సంఘం కోరింది. అదే సమయంలో, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తించి ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్నికి వెన్నుపోటు పొడిచిందని విమర్శలు గుప్పించారు.
