Autos Allowed on Yadadri: తెలంగాణలో అనేక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా యాదాద్రిలో నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ప్రస్తుతం యాదాద్రి కొండపైకి ఆర్టీసీ బస్సులు మాత్రమే వస్తున్నాయి.. అన్ని వాహనాలను అనుమతించడం లేదు. సొంత వాహనాల్లో కొండపైకి వెళ్లాలనుకునే భక్తులకు పార్కింగ్ ఫీజులు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో యాదాద్రి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇక నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తారు. ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి 11 నుంచి మొదటి ఘాట్ రోడ్డు ద్వారా ఆటోలను కొండపైకి అనుమతించాలని నిర్ణయించినట్లు ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ప్రకటించారు. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించాలని నిర్ణయించారు. రోజుకు 100 ఆటోలు షిఫ్టుల వారీగా కొండపైకి నడుస్తున్నాయని వివరించారు.
Read also: Telangana Govt: రాష్ట్రంలో ‘హెల్త్ కార్డు – డిజిటల్ రికార్డు’! కానీ.. ఏజ్ లిమిట్ ఉందండోయ్..
మొదటి షిప్టు ఉదయం 3 గంటల నుంచి ఒంటి గంట వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఒక్కో షిఫ్టులో 50 ఆటోలు నడపాలి. కొండపైన 25 ఆటోలు ఉంటే మరో 25 ఆటోలు కొండ కింద ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు కొన్ని దిశానిర్దేశం చేశారు. ఒక్కో ఆటోలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులను మాత్రమే అనుమతించాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ వంటి అన్ని రకాల సర్టిఫికెట్లు కలిగి ఉండాలన్నారు. ఇంకా ఆటో డ్రైవర్లపై నిరంతర నిఘా ఉంటుందని వివరించారు. ఆటో చార్జీలు ఎంతమేరకు నిర్ణయించాలనేది ఆటోడ్రైవర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. యాదాద్రి కొండపై భక్తులకు కనువిందు చేసేందుకు వీలుగా పదిరోజుల్లో డార్మెటరీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని బిర్లా ఐలయ్య తెలిపారు.
Liquor Maker : లగ్జరీ ప్రీమియం విస్కీని విడుదల చేసిన రాడికో ఖైతాన్ కంపెనీ
కొండపైకి ఆటోలను 12 ఏప్రిల్ 2022 నుంచి అనుమతించకపోవడంతో యాదగిరిగుట్ట ఆలయ అధికారులపై ఆటో డ్రైవర్లు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.. గుట్టపైకి ఆటోల రవాణాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు ఆలయం ఎదుట ఆందోళన చేసారు. ఎన్నో ఏళ్లుగా వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని అన్నారు. చాలా మంది భక్తులకు,వృద్ధులకు,వికలాంగులు కూడా దర్శనం కోసం కొండకు చేరుకోవడానికి తాము సహాయం చేస్తున్నామని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో కొండపైకి ఆటోలను నిషేధించారని, మాకు కష్టాలు తప్పవని ఆటోడ్రైవర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మారడం ఆటోవాళ్ల కష్టాల్లో వెలుగు రావడం అయ్యిందని పలువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లను కొండపైకి అనుమతించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.