AP High Court: చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్

Chandrababu

Chandrababu

AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు.. ఇలా మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు ముగిసిన నేపథ్యంలో కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Read Also: TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు ఆమోదం.. సర్కార్ కు గవర్నర్ కీలక సూచనలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మొదట మధ్యంతర బెయిల్‌ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. ఇక, ఐఆర్‌ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.