అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు మరోసారి జో బైడెన్-మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ పడుతున్నారు. ప్రచారంలో భాగంగా ట్రంప్ గురించి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను గెలవనివ్వొద్దని ప్రపంచవ్యాప్తంగా చాలామంది దేశాధినేతలు తనకు చెప్పినట్లు బైడెన్ హాట్ కామెంట్స్ చేశారు.
ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. దీంతో ఇరువురు నేతలు ప్రచార జోరు పెంచారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడు బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవకూడదని ప్రపంచ నేతలు తనతో చెప్పారన్నారు. అలా జరిగితే ప్రజాస్వామ్య దేశాలకు ప్రమాదకరమని వారు భావిస్తున్నట్లు బైడెన్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Anchor Suma: ఆ సీన్ చూసి ఏడ్చేశాను.. హిట్ సినిమాకి సుమ రివ్యూ వైరల్!
ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూయార్క్‌లో నిర్వహించిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. నవంబరులో తాను ఓడిపోతే రక్తపాతమే అని ట్రంప్ చెబుతున్నారని.. ఇది అత్యంత ఆందోళనకర అంశం అని తెలిపారు. ఈ మధ్య తాను ఏ దేశాధినేతను కలిసినా వారు ఒకటే చెబుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను గెలవనివ్వకండా చూడాలని అడుగుతున్నారని తెలిపారు. భారత్‌లో జరిగిన జీ20 సదస్సులో ప్రపంచ నేతలు ఇదే కోరారని గుర్తుచేశారు. ఆయన గెలిస్తే వారి ప్రజాస్వామ్యాలు ప్రమాదంలో పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారని బైడెన్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: T20 World Cup: టీ20 వరల్డ్ కప్కు టీమిండియా ప్రకటన అప్పుడే..!
తాజాగా బైడెన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే చెలరేగేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. లైట్ తీసుకుంటారా? లేదంటే గట్టి కౌంటరిస్తారా? అన్నది చూడాలి.
ఇది కూడా చదవండి: Chidambaram: ఐటీ నోటీసులపై చిదంబరం కీలక వ్యాఖ్యలు