Anchor Suma: ఆ సీన్ చూసి ఏడ్చేశాను.. హిట్ సినిమాకి సుమ రివ్యూ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Suma Review on The Goat Life goes Viral: స్వతహాగా మలయాళీ అయినా సుమ తెలుగమ్మాయే అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అంతలా ఆమె తెలుగు వారికి దగ్గరైంది. తెలుగు వాడైన రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్న ఆమె ఇక్కడే టాప్ యాంకర్ గా సెటిల్ అయిపొయింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఒక రివ్యూ షేర్ చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను సుమ తాజాగా చూశారట. దీంతో ఈ సినిమా తనకెంతో నచ్చిందని చెబుతూ దర్శకుడి ప్రతిభను మెచ్చుకున్నారు.
CM YS Jagan: 7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు కదిలిన జనప్రభంజనం
Also Read
‘‘ఆడు జీవితం’ చూశా, నజీబ్ కథను చాలా వివరంగా మనసుని హత్తుకునేలా చాటి చెప్పారు. ఈ సినిమా దర్శకుడు బ్లెస్సీకి నా సెల్యూట్. పృథ్వీరాజ్.. పూర్తిగా బరువు తగ్గిపోయి, పక్కటెముకలు బయటకు కనిపించే సన్నివేశంలో మిమ్మల్ని చూసి నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి, సినిమా పట్ల మీకు ఉన్న ప్రేమ, నిబద్ధతకు ఇది నిదర్శనం’’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె రాసుకొచ్చారు. దీనితోపాటు సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ల ‘టిల్లు స్క్వేర్’ కూడా ఆమె చూసినట్టు వెల్లడించారు. ఆ సినిమా అయితే ఆద్యంతం నవ్వులు పూయించిందని చెబుతూ టిల్లు స్క్వేర్ టీమ్‌ను మెచ్చుకున్నారు. జీవనోపాధిలో భాగంగా కొన్నేళ్ల క్రితం కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి రియాద్ వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోగా అతడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని బెన్నీ డానియేల్ ‘గోట్ డేస్’ అనే నవలను రాశారు. దానిని ప్రామాణికంగా చేసుకుని బ్లెస్సీ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు దక్కించుకుని ముందుకు దూసుకుపోతోంది.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!