Israel-Hamas: బైడెన్ జోక్యంతో మెత్తబడ్డ ఇజ్రాయెల్.. తాజా నిర్ణయమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇంకోవైపు గాజాలో మానవ సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గాజాలో సాయం చేసేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. ఈవారంలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Raashi Khanna : గార్జియస్ లుక్ లో రాశి ఖన్నా లేటెస్ట్ పిక్స్..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధంతో గాజాలో తీవ్ర కరవు నెలకొంది. సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడికి మానవతా సాయాన్ని అనుమతించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాయి. దీంతో ఉత్తర సరిహద్దుల్లో మరికొన్ని దారులు తెరవడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. రఫాలోనూ భూతల దాడులు ప్రారంభిస్తే గాజాలోని మిగిలిన ప్రాంతంతో దానికి సంబంధాలు తెగిపోనున్నాయి. అప్పుడు ఈ దారులే కీలకం కానున్నాయి. రఫాలోని దాదాపు పది లక్షల మంది పాలస్తీనావాసులకు రక్షణ కల్పించని ఏ ఆపరేషన్‌కూ అమెరికా మద్దతు ఉండబోదని బైడెన్ తేల్చి చెప్పినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. రఫా ఆక్రమణను అగ్రరాజ్యం తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. మరోవైపు గతంతో పోలిస్తే గాజాలోకి మానవతా సాయం ముమ్మరంగా చేరుతోందని బైడెన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగేందుకు సహకరించాలని నెతన్యాహుకు సూచించారు.
ఇది కూడా చదవండి: Congress: రాయ్‌బరేలీ అభ్యర్థి ఖరారు.. ఏ క్షణంలోనైనా ప్రకటన!
హమాస్ చెరలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని బైడెన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తద్వారా కాల్పుల విరమణ, గాజా పునఃనిర్మాణం దిశగా ముందడుగు వేయాలని హమాస్‌కు సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్ భద్రత విషయంలో అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేయబోదని బైడెన్ హామీ ఇచ్చారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అందించిన ఆపన్నహస్తమే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Delhi High Court: ఆరేళ్ల పాటు ప్రధాని మోడీ పోటీ చేయకుండా నిషేధించాలి..
- Tags
- biden
- GAZA
- Hamas
- Israel
- Israels plan
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!