NTV Telugu Site icon

Israel-Hamas: బైడెన్ జోక్యంతో మెత్తబడ్డ ఇజ్రాయెల్.. తాజా నిర్ణయమిదే!

Bdie

Bdie

గాజా-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇంకోవైపు గాజాలో మానవ సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గాజాలో సాయం చేసేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. ఈవారంలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Raashi Khanna : గార్జియస్ లుక్ లో రాశి ఖన్నా లేటెస్ట్ పిక్స్..

హమాస్‌ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ చేపట్టిన యుద్ధంతో గాజాలో తీవ్ర కరవు నెలకొంది. సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడికి మానవతా సాయాన్ని అనుమతించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాయి. దీంతో ఉత్తర సరిహద్దుల్లో మరికొన్ని దారులు తెరవడానికి ఇజ్రాయెల్‌ అంగీకరించింది. రఫాలోనూ భూతల దాడులు ప్రారంభిస్తే గాజాలోని మిగిలిన ప్రాంతంతో దానికి సంబంధాలు తెగిపోనున్నాయి. అప్పుడు ఈ దారులే కీలకం కానున్నాయి. రఫాలోని దాదాపు పది లక్షల మంది పాలస్తీనావాసులకు రక్షణ కల్పించని ఏ ఆపరేషన్‌కూ అమెరికా మద్దతు ఉండబోదని బైడెన్‌ తేల్చి చెప్పినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. రఫా ఆక్రమణను అగ్రరాజ్యం తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. మరోవైపు గతంతో పోలిస్తే గాజాలోకి మానవతా సాయం ముమ్మరంగా చేరుతోందని బైడెన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగేందుకు సహకరించాలని నెతన్యాహుకు సూచించారు.

ఇది కూడా చదవండి: Congress: రాయ్‌బరేలీ అభ్యర్థి ఖరారు.. ఏ క్షణంలోనైనా ప్రకటన!

హమాస్‌ చెరలో ఉన్న బందీలను వెంటనే విడిచిపెట్టాలని బైడెన్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. తద్వారా కాల్పుల విరమణ, గాజా పునఃనిర్మాణం దిశగా ముందడుగు వేయాలని హమాస్‌కు సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్‌ భద్రత విషయంలో అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేయబోదని బైడెన్‌ హామీ ఇచ్చారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అందించిన ఆపన్నహస్తమే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Delhi High Court: ఆరేళ్ల పాటు ప్రధాని మోడీ పోటీ చేయకుండా నిషేధించాలి..