Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Bhuvneshwar Kumar Impressed Playing For Rcb In Ipl 2026 Team India Comeback Talks Intensify

Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!

Published Date :May 11, 2026 , 9:53 am
By Kothuru Ram Kumar
Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Bhuvneshwar Kumar: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మరో ఉత్కంఠభరితమైన కీలక విజయాన్ని అందుకుంది. రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి బంతి థ్రిల్లర్లో విజయం సాధించిన RCB పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనే. అవును.. ఒకవైపు బ్యాట్ తో, మరోవైపు బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన భువీ.. “స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్” అనేలా తన క్లాస్‌ను మరోసారి చూపించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో 21 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ ముందున్న భువీ.. టీమిండియాలోకి రీఎంట్రీకి బలమైన సంకేతాలు ఇస్తున్నాడు.

మ్యాచ్ చివరి ఓవర్‌లో RCB విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్‌లో రొమారియో షెపర్డ్, రసిక్ సలామ్ దర్ ఉన్నారు. యువ బౌలర్ రాజ్ బావా ఒత్తిడిలో అద్భుత బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ముంబై వైపు మళ్లినట్లు కనిపించింది. చివరి మూడు బంతుల్లో 9 పరుగులు అవసరమైన సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ అసలు మ్యాజిక్ చూపించాడు. వైడ్ యార్కర్‌ గా వచ్చిన బంతిని అద్భుతంగా డీప్ కవర్ మీదుగా సిక్స్‌ గా మలిచిన భువీ.. మ్యాచ్‌ను ఒక్కసారిగా RCB వైపు తిప్పేశాడు.

Also Read

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
  • చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
  • Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
  • Road Accident: కారు - బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
Add as a preferred
source on google

మరోవైపు బౌలింగ్‌లో కూడా భువీ అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ముంబై టాప్ ఆర్డర్‌ను కుదేలు చేస్తూ రయాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు వరుసగా తీసి ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. భూవీ దెబ్బకు మూడు ఓవర్లకే ముంబై స్కోర్ 28/3గా మారింది. మొత్తంగా అద్భుత ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ కూడా లభించింది. అయితే మ్యాచ్ అనంతరం భువీ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

A gentle reminder that true greatness is built on discipline 🫡

🎥 Bhuvneshwar Kumar with words of wisdom 🗣️#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/6J1N6iT5SW

— IndianPremierLeague (@IPL) May 10, 2026

నాలుగు వికెట్లు తీసిన దానికంటే తాను కొట్టిన సిక్సే ఎక్కువ ఆనందం ఇచ్చిందని నవ్వుతూ అన్నాడు. “వికెట్లు చాలా సార్లు తీశాను. కానీ ఆ సిక్స్ మాత్రం చాలా స్పెషల్. అదే నాకు ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చింది” అని భువనేశ్వర్ అన్నారు. ఇంకా రోహిత్ శర్మ వికెట్ గురించి మాట్లాడుతూ.. “రోహిత్ ముందుకొచ్చి ఆడతాడని ముందే ఊహించాను. గతంలో కూడా నాపై అలా ఆడాడు. సూర్యకుమార్ కొత్తగా క్రీజ్‌ లోకి రావడంతో సాధారణ లెంగ్త్ బంతి వేయాలని అనుకున్నా. అది సక్సెస్ అయింది” అని తెలిపాడు.

ఇక టీమిండియాలోకి తిరిగి రావాలనే విషయంపై కూడా భువీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మోటివేషన్ కంటే క్రమశిక్షణే తనను ముందుకు నడిపిస్తుందని తన సీక్రెట్ ను చెప్పకనే చెప్పాడు. “మోటివేషన్ అనేది కొన్ని నిమిషాలే ఉంటుంది. వీడియోలు చూసి, కోట్స్ చదివి వచ్చే ఉత్సాహం త్వరగా పోతుంది. కానీ నన్ను నడిపించేది డిసిప్లిన్” అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. 2022 తర్వాత భారత జట్టుకు దూరంగా ఉన్న భువీ.. ఇప్పుడు ఐపీఎల్‌లో చూపిస్తున్న ఫామ్ చూస్తే టీమిండియాలోకి అతడి రీఎంట్రీ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

The shot that tilted the game RCB's way 🙌🙌🙌

P.S.: The last time Bhuvneshwar Kumar hit a six in the IPL was in 2016 against Rising Pune Supergiants 😅 #IPL2026 #RCBvMI pic.twitter.com/5Bxs3nxv1x

— Cricbuzz (@cricbuzz) May 10, 2026

Everyone doubted RCB's decision to spend 10 crores+ on aging Bhuvneshwar Kumar & now he made RCB champion in his very debut season & now best pacer of this tournament. Even 25 crores on Bhuvneshwar Kumar would be justified at this point!
pic.twitter.com/ev0s2XTJYh

— Rajiv (@Rajiv1841) May 10, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhuvneshwar kumar
  • Bhuvneshwar Kumar comeback
  • Bhuvneshwar Kumar wickets
  • Bhuvneshwar six
  • RCB vs MI

తాజావార్తలు

  • Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా

  • చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!

  • Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions