Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మరో ఉత్కంఠభరితమైన కీలక విజయాన్ని అందుకుంది. రాయ్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన చివరి బంతి థ్రిల్లర్‌లో విజయం సాధించిన RCB పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది సీనియర్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శనే. అవును.. ఒకవైపు బ్యాట్ తో, మరోవైపు బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన భువీ.. “స్వింగ్ కింగ్ ఈజ్ బ్యాక్” అనేలా తన క్లాస్‌ను మరోసారి చూపించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో 21 వికెట్లతో పర్పుల్ క్యాప్ ముందున్న భువీ.. టీమిండియాలోకి రీఎంట్రీకి బలమైన సంకేతాలు ఇస్తున్నాడు.
మ్యాచ్ చివరి ఓవర్లో RCB విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్‌లో రొమారియో షెపర్డ్, రసిక్ సలామ్ దర్ ఉన్నారు. యువ బౌలర్ రాజ్ బావా ఒత్తిడిలో అద్భుత బౌలింగ్ చేయడంతో మ్యాచ్ ముంబై వైపు మళ్లినట్లు కనిపించింది. చివరి మూడు బంతుల్లో 9 పరుగులు అవసరమైన సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ అసలు మ్యాజిక్ చూపించాడు. వైడ్ యార్కర్ గా వచ్చిన బంతిని అద్భుతంగా డీప్ కవర్ మీదుగా సిక్స్ గా మలిచిన భువీ.. మ్యాచ్‌ను ఒక్కసారిగా RCB వైపు తిప్పేశాడు.
Also Read
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
మరోవైపు బౌలింగ్‌లో కూడా భువీ అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ముంబై టాప్ ఆర్డర్‌ను కుదేలు చేస్తూ రయాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు వరుసగా తీసి ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. భూవీ దెబ్బకు మూడు ఓవర్లకే ముంబై స్కోర్ 28/3గా మారింది. మొత్తంగా అద్భుత ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ కూడా లభించింది. అయితే మ్యాచ్ అనంతరం భువీ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
A gentle reminder that true greatness is built on discipline 🫡
🎥 Bhuvneshwar Kumar with words of wisdom 🗣️#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/6J1N6iT5SW
— IndianPremierLeague (@IPL) May 10, 2026
నాలుగు వికెట్లు తీసిన దానికంటే తాను కొట్టిన సిక్సే ఎక్కువ ఆనందం ఇచ్చిందని నవ్వుతూ అన్నాడు. “వికెట్లు చాలా సార్లు తీశాను. కానీ ఆ సిక్స్ మాత్రం చాలా స్పెషల్. అదే నాకు ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చింది” అని భువనేశ్వర్ అన్నారు. ఇంకా రోహిత్ శర్మ వికెట్ గురించి మాట్లాడుతూ.. “రోహిత్ ముందుకొచ్చి ఆడతాడని ముందే ఊహించాను. గతంలో కూడా నాపై అలా ఆడాడు. సూర్యకుమార్ కొత్తగా క్రీజ్ లోకి రావడంతో సాధారణ లెంగ్త్ బంతి వేయాలని అనుకున్నా. అది సక్సెస్ అయింది” అని తెలిపాడు.
ఇక టీమిండియాలోకి తిరిగి రావాలనే విషయంపై కూడా భువీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మోటివేషన్ కంటే క్రమశిక్షణే తనను ముందుకు నడిపిస్తుందని తన సీక్రెట్ ను చెప్పకనే చెప్పాడు. “మోటివేషన్ అనేది కొన్ని నిమిషాలే ఉంటుంది. వీడియోలు చూసి, కోట్స్ చదివి వచ్చే ఉత్సాహం త్వరగా పోతుంది. కానీ నన్ను నడిపించేది డిసిప్లిన్” అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. 2022 తర్వాత భారత జట్టుకు దూరంగా ఉన్న భువీ.. ఇప్పుడు ఐపీఎల్లో చూపిస్తున్న ఫామ్ చూస్తే టీమిండియాలోకి అతడి రీఎంట్రీ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
The shot that tilted the game RCB's way 🙌🙌🙌
P.S.: The last time Bhuvneshwar Kumar hit a six in the IPL was in 2016 against Rising Pune Supergiants 😅 #IPL2026 #RCBvMI pic.twitter.com/5Bxs3nxv1x
— Cricbuzz (@cricbuzz) May 10, 2026
Everyone doubted RCB's decision to spend 10 crores+ on aging Bhuvneshwar Kumar & now he made RCB champion in his very debut season & now best pacer of this tournament. Even 25 crores on Bhuvneshwar Kumar would be justified at this point!
pic.twitter.com/ev0s2XTJYh— Rajiv (@Rajiv1841) May 10, 2026
తాజావార్తలు
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!